బురద గుంతలతో వెక్కిరిస్తున్న కాలనీ రోడ్లు...! ఎందుకు యాగాలంటున్న తెలంగాణ ప్రజానికం..!!

హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు రాను రాను 'యాగాల సీఎం' గా మారిపోతున్నారు. ఓట్లేసి అధికారాన్ని చేతికిస్తే, మూణ్నెల్లకోసారి ప్రత్యేక పూజలు, ఆర్నెల్లకోసారి పెద్ద యాగాలతో కాలక్షేపం చేస్తున్నారని ప్రజల మద్య చర్చ జరుగుతోంది. పాలకుడిగా ప్రథమ కర్తవ్యం ప్రజల కష్టాలు, కన్నీళ్లకు చెక్ చెప్పటం. వారు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం వెతకటం అవసరం. ఆ విషయాన్ని వదిలేసి, పూజలు.. పునస్కారాలు.. భవంతుల కూల్చివేతలు, కొత్తవి నిర్మించటం పైనే ఫోకస్ పెట్టే ముఖ్యమంత్రి జనాల జీవితాల్ని ప్రభావితం చేసే అంశాల మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదన్న అంశం పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

చినుకు పడితే చిత్తడే..! నడవడానికి వీలులేకుండా మారిన కాలనీ రోడ్లు..!!

చినుకు పడితే చిత్తడే..! నడవడానికి వీలులేకుండా మారిన కాలనీ రోడ్లు..!!

తాజాగా మరో భారీ యాగానికి తెర తీశారు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు. పాలకులు పాలన చేయాలే కానీ యాగాలు కాదు. సరే.. యాదాద్రిలో ఆయన తలపెట్టే భారీ యాగానికి అయ్యే ఖర్చు ఎవరిది..? ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసే ప్రజాధనంతోనే. ఆ డబ్బుతో నరకంగా మారిన హైదరాబాద్ రోడ్లను మార్చేందుకు ఖర్చు చేస్తే అంతో ఇంతో ప్రయోజనం ఉంటుంది. దానికి బదులుగా నమ్మకాల కోసం ఖర్చు చేయటం వల్ల ప్రయోజనం ఏమిటి అన్నదే చర్చనీయాంశంగా మారింది.

యాగాలతో సీఎం కాలక్షేపం..! జనాల యాదిలో ఉండేది ఎప్పుడు..?

యాగాలతో సీఎం కాలక్షేపం..! జనాల యాదిలో ఉండేది ఎప్పుడు..?

దేవుడు ఉన్నాడా? లేడా? అన్న చర్చలోకి వెళ్లటం అంత సమంజసం కాకపోయినప్పటికీ, నమ్మకాల జోలికి వెళ్లడం కూడా పద్దతి కాదనుకోండి. కాకుంటే.. ఎవరి వ్యక్తిగత సెంటిమెంట్లు వారికి ఉంటాయి. వాటిని అందరూ గౌరవించాల్సిందే. కాకుంటే.. ఒకరి సెంటిమెంట్ ను తీర్చుకోవటం కోసం ప్రజా ధనాన్ని వృధా చేయడం, విచ్చల విడిగా వాడేస్తానన్నప్పుడే మాత్రం అభ్యంతరాలు వచ్చిపడుతుంటాయి. విమర్శలు కూడా అప్పుడే వెల్లువెత్తుతాయి.

మౌళిక సదుపాయలు మృగ్యం..! పట్టించుకున్న నాథుడు కరువు..!!

మౌళిక సదుపాయలు మృగ్యం..! పట్టించుకున్న నాథుడు కరువు..!!

దాదాపు 700 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న హైదరాబాద్ మహానగరంలో తక్కువలో తక్కువ 200 కీలోమీటర్ల మేర లక్షలాది మంది ప్రజలు నిత్యం ప్రయాణం చేస్తుంటారు. ఈ రోడ్లు సరిగా లేని కారణంగా జరుగుతున్న ప్రమాదాలు ఒక ఎత్తు అయితే.. ఆ ప్రమాదాల కారణంగా మరణిస్తున్న ప్రజల సంగతేమిటి? అన్నది మరో ప్రశ్న. వీటిని పట్టించుకోవాల్సిన ప్రజా ప్రతినిధులు ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించి తరువాత ఎక్కడ మాయమవుతారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమస్యలపై దృష్టి పెట్టాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది.

ప్రజా సమస్యలపై శ్రద్ద లేదు..! విసిగిపోతున్న జనాలు..!!

ప్రజా సమస్యలపై శ్రద్ద లేదు..! విసిగిపోతున్న జనాలు..!!

ఎన్నో కుటుంబాలను బలి తీసుకుంటున్న రోడ్లను సరిగా చేస్తే దాని కారణంగా కోటిన్నర ప్రజలకు ప్రయోజనంగా మారుతుంది. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చి ఐదేళ్లు దాటి, ఆరో ఏడు దిశగా పరుగులు తీస్తుంది. అరవై ఏళ్ల పాలనలో హైదరాబాద్ ను నాశనం చేశానని వాపోయే ముఖ్యమంత్రి, తన ఐదేళ్ల పాలనలో కించిత్ కూడా మార్చలేకపోయారన్న చేదు నిజాన్ని ఎప్పటికి గ్రహిస్తారని చర్చ జరుగుతోంది. విమర్శలతో ఉతికి ఆరేసే ముఖ్యమంత్రి.. అవే విమర్శలు తనను వేలెత్తి చూపిస్తాయన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతారు? క్యాలెండర్లో ఏళ్లు మారుతున్నాయి.. కానీ.. హైదరాబాద్ మారటం కాదు.. రోడ్ల రూపురేఖలు కూడా మారటం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+