• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విశాల భార‌త‌దేశం కోసం సువిశాల ద్రుక్ప‌దంతో రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా..! మాజీ జేడీ ల‌క్షీ నారాయ‌ణ..!

|

హైద‌రాబాద్ :బ‌లంతులు ఎప్పుడూ త‌న‌గురించి చెప్పుకుంటారు, బ‌ల‌హీనులే ఇత‌రుల గురించి ప్ర‌స్తావిస్తుంటారు, నేను బ‌ల‌వంతున్ని, నాగురించే చెప్పుకుంటున్నాను అని మాజీ సీబీఐ అదికారి ల‌క్ష్మీనారాయ‌ణ తెలిపారు. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీలక్ష్మీనారాయణ మాజీ ఐఎఎస్ అధికారి ఎన్.జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని లోక్ సత్తా పార్టీలో చేరే అంశాన్ని ప‌రిశీలిస్తాన‌ని అన్నారు. తాను ఏ ప్రాంతానికో ప‌రిమితం కాద‌ని విశాల భార‌త దేశం కోసం సువిశాల ద్రుక్ప‌థంతో రాజ‌కీయాల్లో కి వ‌స్తున్న‌ట్టు చెప్పారు. చాలా రాజ‌కీయ పార్టీలు త‌న‌ను ఆహ్వానించాయ‌ని, కాని పార్టీ విధివిధానాలు చెప్పిన త‌ర్వాత పార్టీలో జాయిన్ అవుతాన‌ని చెప్పిన‌ప్పుడు ఏ పార్టీ కూడా త‌న‌కు విధి విధానాలు చెప్ప‌లేద‌ని అన్నారు మాజీ జేడీ. స‌మ‌రాలీన రాజ‌కీయాల‌పై ఆయ‌న సుదీర్గంగా చ‌ర్చించారు.

లోక్ సత్తాలో చేరే అంశం ప‌రిశీలిస్తా.! కొత్త‌పార్టీ గురించి ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌న్న‌ మాజీ జేడీ..!

లోక్ సత్తాలో చేరే అంశం ప‌రిశీలిస్తా.! కొత్త‌పార్టీ గురించి ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌న్న‌ మాజీ జేడీ..!

ఒక వారం నుంచి స్వయంగా లక్ష్మీనారాయణ జనధ్వని, వందేమాత‌రం పేరుతో రాజకీయ పార్టీ స్ధాపించబోతున్నారని మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఇదే ఉద్దేశంతో తన రాజకీయ భవిష్యత్తు ప్రకటించడానికి సోమవారం సోమవారం ఆయన నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని ఇందిరా ప్రియదర్శినీ ఆడిటోరియంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రచారం జరుగుతున్నట్లుగానే లక్ష్మీనారాయణ జనధ్వని పార్టీ పేరును గాని వందేమాత‌రం పేరును గాని ప్రకటిస్తారని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వందలాది మంది అభిమానులు ఆసక్తితో ఎదురుచూసారు. కానీ జేడి త‌న కొత్త పార్టీ గురించి త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పుకొచ్చారు.

ప్ర‌జా మేనిఫెస్టో రూప‌క‌ల్ప‌న‌..! ప్ర‌జ‌ల్లో ఆనందం నింపేందుకే వ‌స్తున్నా..!! జేడీ..

ప్ర‌జా మేనిఫెస్టో రూప‌క‌ల్ప‌న‌..! ప్ర‌జ‌ల్లో ఆనందం నింపేందుకే వ‌స్తున్నా..!! జేడీ..

సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ సమావేశంలో ముందుగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చాలా స్పూర్తివంతమైన ప్రసంగం చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు విస్పష్టంగా ప్రకటించారు. ఏదో పార్టీలో చేరకుండా తానే స్వయంగా పార్టీ పెడతానని... పార్టీ పేరు, విధివిధానాలు త్వరలో ప్రకటిస్తానని కూడా సభికులకు తెలిపారు. తాను ఐదు నెల్లుగా ఏపీలోని 12 జిల్లాలు క్షేత్రస్ధాయిలో తిరిగిన అనుభవాలను వివరించారు.

 ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో శూన్య‌త ఉంది. నేను బాణాన్ని కాదు.. ధ‌న‌స్సుని..!!

ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో శూన్య‌త ఉంది. నేను బాణాన్ని కాదు.. ధ‌న‌స్సుని..!!

వ్యవస్ధను మారుద్దామన్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తూ నేను చేతులు ముడుచుకు కూర్చోలేనన్నారు. ప్రభుత్వ అలసత్వాలను, అసమాన‌తలతో కూడిన నిర్ణయాలను, అవినీతిని, దుబరా ఖర్చులను చూస్తూ ఉందామా అని ప్రశ్నించారు. భారత రాజ్యాంగమే తాను స్ధాపించబోయే పార్టీకి మేనిఫెస్టో అన్నారు. తాను స్ధాపించబోయే పార్టీ వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధికల్పన, సమానత్వం, అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తుందని సోదాహరణంగా వివరించారు.

 ముంద‌స్తు నిర్ణ‌యం రాజ్యాంగానికి లోబ‌డే ఉంది...! అవినీతి నిర్మూల‌నే ల‌క్ష్యంగా ప‌నిచేస్తా..!!

ముంద‌స్తు నిర్ణ‌యం రాజ్యాంగానికి లోబ‌డే ఉంది...! అవినీతి నిర్మూల‌నే ల‌క్ష్యంగా ప‌నిచేస్తా..!!

సభికుల్లో ఒక నూతనోత్సాహాన్ని నింపుతూనే లక్ష్మీనారాయణ త‌న రాజ‌కీయ అరంగేట్రం గురించి కీల‌క అంశాలు మీడియాకు వెళ్ల‌డించారు. ప్ర‌జా ప్ర‌తినిధుల భ‌ద్ర‌త ప్ర‌భ‌త్వాల‌దే న‌ని తేల్చి చెప్పారు. తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌లు రాజ్యంగ‌బ‌ద్దంగా జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. రాజ‌కీయ కొన్ని అంశాల్లో రాజ‌కీయ శూన్య‌త ఉంద‌ని చెప్పిని ల‌క్షీ నారాయ‌ణ‌, రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ఏ మీడియాను కూడా సొంతంగా పెట్టే ఆలోచ‌న చేయ‌న‌ని చెప్పారు. తాను మోదీ వ‌దిలిన బాణాన్ని కాద‌ని తాను ధ‌నుస్సు లాంటా వాడిన‌ని, బాణాలు స్వ‌యంగా వ‌దులుతాన‌ని చెప్పుకొచ్చారు. లోక్ సత్తా అధినేత ఎన్.జయప్రకాష్ నారాయణ లోక్ సత్తాలో చేరమని లక్షీ నారాయ‌ణ‌ను ఆహ్వానించారు. వెనువెంటనే లక్ష్మీనారాయణ లోక్ సత్తాతో కలసి పనిచేస్తానని ప్రకటించారు. దీంతో లక్ష్మీనారాయణ నేతృత్వంలో నూతన పార్టీ ఏర్పడుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

English summary
The forces always say, the weaknesses refer to others, I am strong and say that I am telling you, "said former CBI officer Lakshminarayana. Former Joint Director of lakshinarayana, former IAS officer Jayaprakash Narayan, said he would consider the issue of joining the Lok Satta Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X