బీఆర్ఎస్ ఓటమిపై ప్రశాంత్ కిశోర్ అంచనాలు: కాంగ్రెస్ ఘనత కాదని తేల్చిన వ్యూహకర్త

Prashant Kishor: తెలంగాణలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారత్ రాష్ట్ర సమితి పరాజయం పాలైంది. 39 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. 119 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 64 సీట్లను సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై మూడు రోజులే అయింది. కొత్త ప్రభుత్వం ఇంకా కుదురుకోలేదు. పూర్తి స్థాయి మంత్రివర్గమూ ఇంకా ఏర్పాటు కాలేదు. ముఖ్యమంత్రి మినహా మంత్రులు ఇంకా తమ బాధ్యతలనూ స్వీకరించనూ లేదు.

Prashant Kishore

తెలంగాణతో పాటు జరిగిన నాలుగు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ మినహా మిగిలిన చోట్ల అధికార పార్టీలు ఓడిపోయాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లల్లో అధికారాన్ని అందుకోగలిగింది. మిజోరంలో ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూమెంట్ అధికారంలోకి వచ్చింది.

ఈ ఎన్నికల ఫలితాలపై తాజాగా ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. మిజోరం మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తనదైన శైలిలో విశ్లేషించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందనడం కంటే కూడా భారత్ రాష్ట్ర సమితి ఓడిందని చెప్పడమే సబబు అని వ్యాఖ్యానించారు.

మధ్యప్రదేశ్ మినహా మిగలిన చోట్లల్లా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా పని చేసిందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లల్లో అధికారంలోకి రావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. హిందుత్వ.. కీలకంగా పని చేసిందని వ్యాఖ్యానించారు.

Prashant Kishore

హిందుత్వ విధానాలను బీజేపీ గట్టిగా వినిపించిందని, దాని ఫలితంగానే ఈ ఎన్నికల్లో విజయం సాధించగలిగిందని ప్రశాంత్ కిశోర్ అన్నారు. దీనితో పాటు జాతీయవాదం, సంస్థాగతంగా ఆ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉండటం, లాడ్లీ బెహెన్ వంటి కొన్ని సంక్షేమ పథకాలు ఆ పార్టీ విజయానికి బాటలు వేశాయని చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా గెలవలేదని ప్రశాంత్ కిశోర్ తేల్చిచెప్పారు. ఈ గెలుపు కాంగ్రెస్‌ది కాదని, బీఆర్ఎస్ ఓటమి అని అభివర్ణించారు. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్‌ను ఎంచుకున్నారని, ఆ పార్టీకి ఓటు వేశారని అంతే గానీ.. ఆ పార్టీని చూసి కాదని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+