Telangana Congress తొలి జాబితా విడుదల - 55 స్థానాలు ఖరారు, లిస్టులో..!!
తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటించింది. అనేక తర్జన భర్జనల తరువాత 55 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు వామపక్షాలకు 4 సీట్లు కేటాయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. మిగిలిన 115 స్థానాల్లో ప్రస్తుతం తొలి జాబితాలో 55 మంది పేర్లను ఖరారు చేసింది. మిగిలిన స్థానాలకు 60 మంది పేర్లను ఒకటి రెండు రోజుల్లోనే విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
ఎంపీలు ఎమ్మెల్యేలుగా: తొలి జాబితాతో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ఉత్తం కుమార్ రెడ్డి అసెంబ్లీ సీట్లు కేటాయించారు. జానారెడ్డి కుమారుడుకి సీటు ఖాయమైంది. ఇక..మైనంపల్లి కుటుంబానికి రెండు సీట్లు కేటాయించారు. సీఎం కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్ నుంచి నర్సిరెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దించుతోంది. జాబితాలో..బెల్లంపల్లి- గడ్డం వినోద్, మంచిర్యాల - ప్రేమ సాగర రావు, నిర్మల్ - శ్రీహరి రావు, ఆర్మూర్ - వినయ్ కుమార్ రెడ్డి, బోధన్ - సుదర్శన రెడ్డి, బాల్కొండ - సునీల్ కుమార్ ముత్యాల, జగిత్యాల - టీ జీవన్ రెడ్డి, ధర్మపురి (ఎస్సీ) - లక్ష్మణ కుమార్, రామగుండం - రాజ్ ఠాకూర్, మంథని - దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి - చింతకుట్ల విజయ రమణరావు, వేముల వాడ -ఆది శ్రీనివాస్, మానుకొండూరు - డాక్టర్ సత్యనారాయణ, మెదక్ - మైనంపల్లి రోహిత్ రావు, ఆంథోల్ - దామోదర రాజనర్సింహ ఉన్నారు.

కొత్త వారికి అవకాశం: జహీరాబాద్ - ఆగం చంద్రశేఖర్, సంగారెడ్డి - తూర్పు జగ్గారెడ్డి, గజ్వేల్ - టీ నర్సారెడ్డి, మేడ్చల్ - తోటకూర వజ్రేశ్ యాదవ్, మల్కాజ్ గిరి- మైనంపల్లి హనుమంతరావు కు కేటాయించారు.కుత్బుల్లాపూర్ -హనుమంతరెడ్డి, ఉప్పల్- పరమేశ్వరెడ్డి, చేవెళ్ల- భీం భారత్, పరిగి- టీ రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ - గడ్డం ప్రసాద కుమార్, ముషీరాబాద్ - అంజన్ కుమార్ యాదవ్, మలక్ పేట- షేక్ అక్బర్, సనత్ నగర్ - డాక్టర్ కోట నీలిమ, నాంపల్లి - మహ్మద్ ఫిరోజ్ ఖాన్, కార్వాన్ - ఉస్మాన్ హజరీ, గోషామహల్ - మొగిలి సునీత, చాంద్రాయణ గుట్ట- బోగ నగేశ్, యాఖుత్ పురా - కే రవిరాజు, బహదూర్ పూర్ - రాజేశ్ కుమార్ పులిపాటి, సికింద్రాబాద్ - ఆదం సంతోష్ కుమార్ పేర్లు ఖరాయ్యాయి.
The CEC has sanctioned the following candidates for the ensuing elections to the Legislative Assembly of Telangana. pic.twitter.com/kdt2CnjOla
— Telangana Congress (@INCTelangana) October 15, 2023
కొత్త సమీకరణాలు: కొడంగల్ - రేవంత్ రెడ్డి, గద్వాల్ - సరితా తిరుపతయ్య, ఆలంపూర్ - డా సంపత్ కుమార్, నాగర్ కర్నూల్ - డాక్టర్ కూచకళ్ల రాజేష్ రెడ్డి, అచ్చంపేట- డాక్టర్ వంశీ క్రిష్ణ, కల్వకుర్తి- కసిరెడ్డి నారాయణరెడ్డికి సీట్లు ఖాయమ్యాయి. షాద్ నగర్ - కే శంకరయ్య, కొల్హపూర్- జూపల్లి క్రిష్ణారావు, నాగార్జున సాగర్- జానారెడ్డి కుమారుడు జయవీర్ కుందూరుకు ఖరారైంది. ఇక.. హుజూర్ నగర్ - నెలమాడ ఉత్తం కుమార్ రెడ్డి, కోదాడ -పద్మావతి రెడ్డి, నల్గొండ - కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకరికల్ - వేముల వీరేశం, ఆలేరు - ఎల్లయ్య, స్టేషన్ గనపూర్ - సింగాపురం ఇందిర, నర్సంపేట- దొంతి మాధవరెడ్డి, భూపాల్ పల్లి- గండ్ర సత్యనారాయణ రావు, ములుగు - సీతక్క, మధిర - భట్టి విక్రమార్క, భద్రాచలం - పోడెం వీరయ్య ఉన్నారు.












Click it and Unblock the Notifications