రణరంగం: దానంపై దాడికి యత్నం, కర్రలతో కాంగ్రెస్ కార్యకర్తల పరస్పర దాడులు(పిక్చర్స్)
హైదరాబాద్: రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కాంగ్రెస్ నేతల గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంది. సోమవారం ఉప్పల్ బస్టాండ్ వద్ద జరిగిన పార్టీ జెండావిష్కరణ విషయంలో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఎగరవేసిన జెండాను మరోసారి ఎలా ఎగరవేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది.
జిల్లాతో సంబంధం లేని నీవు ఇక్కడికి ఎందుకువచ్చావంటూ ఉప్పల్ నియోజకవర్గం ఇంఛార్జ్ బండారు లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. ఎల్‌బినగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ హైదరాబాద్‌లో ఉండాల్సిన నీవు రంగారెడ్డి జిల్లా ఉప్పల్‌కు ఎందుకు వచ్చావని, రావడానికి నీకు ఏమి అధికారం ఉందని నాగేందర్‌ను నిలదీశారు.
తక్షణమే ఇక్కడి నుండి వెళ్లిపోమని హెచ్చరించారు. ఇదే సమయంలో ఇరువర్గాల నేతల అనుచరులు రెచ్చిపోయి కర్రలతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఫుట్‌పాత్ వ్యాపారులు, ప్రయాణికులు భయపడి పరుగులు తీశారు. అప్పటికే ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తమై ఆందోళనకారులను చెదరగొట్టి ప్రశాంత వాతావరణం నెలకొల్పారు.
పోలీసు స్టేషన్‌లో ఇరువర్గాల నేతల ఫిర్యాదులు
ఉప్పల్ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ ఆవిర్భావ సభలో పార్టీ జెండావిష్కరణ విషయంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణపై ఇరువర్గాలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఎగరవేసిన జెండాను మళ్లీ ఎగరవేసి ఘర్షణకు కారణమైన దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్ ఫిర్యాదు చేశారు.
తమపై కర్రలు, మారుణాయుధాలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిర్చడమే కాకుండా హత్య చేయడానికి ప్రయత్నించిన క్యామ మల్లేష్‌కు సంబంధించిన బండారు లక్ష్మారెడ్డి మరి కొందరు అనుచరులపై తగు చర్యలు తీసుకోవాలని దానం నాగేందర్, అనుచరులు మురళీ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు స్వీకరించి ఇరువువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ వై నర్సింహారెడ్డి తెలిపారు.

వాగ్వాదం-ఘర్షణ
రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కాంగ్రెస్ నేతల గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంది.

వాగ్వాదం-ఘర్షణ
సోమవారం ఉప్పల్ బస్టాండ్ వద్ద జరిగిన పార్టీ జెండావిష్కరణ విషయంలో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

వాగ్వాదం-ఘర్షణ
ఎగరవేసిన జెండాను మరోసారి ఎలా ఎగరవేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది.

వాగ్వాదం-ఘర్షణ
జిల్లాతో సంబంధం లేని నీవు ఇక్కడికి ఎందుకువచ్చావంటూ ఉప్పల్ నియోజకవర్గం ఇంఛార్జ్ బండారు లక్ష్మారెడ్డి ప్రశ్నించారు.

వాగ్వాదం-ఘర్షణ
ఎల్‌బినగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ హైదరాబాద్‌లో ఉండాల్సిన నీవు రంగారెడ్డి జిల్లా ఉప్పల్‌కు ఎందుకు వచ్చావని, రావడానికి నీకు ఏమి అధికారం ఉందని నాగేందర్‌ను నిలదీశారు.

వాగ్వాదం-ఘర్షణ
తక్షణమే ఇక్కడి నుండి వెళ్లిపోమని హెచ్చరించారు. ఇదే సమయంలో ఇరువర్గాల నేతల అనుచరులు రెచ్చిపోయి కర్రలతో పరస్పర దాడులు చేసుకున్నారు.

వాగ్వాదం-ఘర్షణ
ఒకదశలో క్యామ మల్లేష్ అనుచరులు నాగేందర్, అతని అనుచరులను తరిమికొట్టారు. ఘటనలో నాగేందర్ అనుచరులకు బలమైన గాయాలయ్యాయి.

వాగ్వాదం-ఘర్షణ
కాంగ్రెస్ 131వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాలను ఎగరవేయాలని రాష్ట్ర చీఫ్ ఉత్తమ కుమార్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ఉప్పల్ నియోజకవర్గంలో పార్టీ జెండాల ఆవిష్కరణకు ఇంఛార్జ్ బండారు లక్ష్మారెడ్డి అనుచరులు ఏర్పాట్లు చేశారు.

వాగ్వాదం-ఘర్షణ
ఉప్పల్ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జెండా ఆవిష్కరణలో జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఇన్‌చార్జి బండారు లక్ష్మారెడ్డి అనుచరులతో పాల్గొని వెళ్లిపోయారు.

వాగ్వాదం-ఘర్షణ
కొద్ది సేపట్లోనే మరో వర్గం హైదరాబాద్ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ అనుచరులతో ర్యాలీగా తరలి వచ్చారు.

వాగ్వాదం-ఘర్షణ
బాణ సంచా పేలుస్తూ ఉప్పల్ రింగ్‌రోడ్డు నుండి ట్రాఫిక్ జాం చేసుకుంటూ వచ్చిన దానం అనుచరులు ఇక్కడ ముందుగా ఎగరవేసిన జెండాను మరోసారి ఎగరవేశారు. విషయం తెలుసుకున్న క్యామ మల్లేష్ వర్గం తిరిగి ఇక్కడికి చేరుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది.

వాగ్వాదం-ఘర్షణ
పట్టపగలు ప్రజలు చూస్తుండగానే ఇరువర్గాలు తీవ్ర స్థాయిలో తిట్టుకుంటూ పార్టీ జెండా కర్రలతో కొట్టుకుంటూ రెచ్చిపోవడంతో జరిగిన తోపులాటలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలు కిందపడిపోయాయి. ఫుట్‌పాత్ వ్యాపారులు, ప్రయాణికులు భయపడి పరుగులు తీశారు.

గాంధీభవన్‌లో..
కాంగ్రెస్ 131వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్‌లో పార్టీ జెండాను ఎగురవేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

గాంధీభవన్‌లో..
కాంగ్రెస్ 131వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్‌లో పార్టీ జెండాను ఎగురవేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.












Click it and Unblock the Notifications