గులాబీల గూండాలే రామక్క.. మందినంత ముంచినారే రామక్క.. బీఆర్ఎస్ పాటకు కాంగ్రెస్ కౌంటర్!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో ఓటర్ల మనసు గెలుచుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక ప్రచారాలలో పాటలతో హోరెత్తిస్తున్నారు. ఇక ఈ ఎన్నికల ప్రచార పాటలలో బీఆర్ఎస్ పాట గులాబీల జెండలే రామక్క ... గురుతుల గుర్తుంచుకో రామక్క టాప్లో నిలిచింది. ఇప్పుడు ఎక్కడ ఎవరి నోటవిన్నా ఇదే పాట వినిపిస్తుంది. ఎక్కడ ఎవరు స్టెప్పులేసినా ఇదే పాటకు వెయ్యటం ప్రధానంగా కనిపిస్తుంది.
తెలంగాణాలోనే కాదు దేశ విదేశాల్లో ఈ పాట బాగా ట్రెండ్ అవుతుంది. 2023 ఎన్నికలకు అన్ని పార్టీలు తయారు చేసిన పాటలలో బి ఆర్ ఎస్ పార్టీ తయారు చేయించిన గులాబీల జెండలే రామక్క పాట హైలెట్ గా నిలిచింది. ఏది ఏమైనా ఈ ఒక్క పాటతో కెసిఆర్ అందరి నోటితో కారును గుర్తుంచుకోవాలని పాడిస్తున్నారు. గురుతును గుర్తుంచుకోవాలని అందరితో చెప్పిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు ఆ తర్వాత కేసీఆర్ నేతృత్వంలో పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను పాట రూపంలో 'గులాబీల జెండలే రామక్క' అంటూ ప్రచారంలో జోష్ పెంచుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇక పాటను కూడా టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ ఇదే బాణీలో మరో కొత్త పాటను బీఆర్ఎస్ కు కౌంటర్ గా తీసుకొస్తుంది.
గులాబీల గుండాలే రామక్క, మందినంత ముంచినారే రామక్క పాటతో కేసీఆర్ పాలన వైఫల్యాలను, కేసీఆర్ కుటుంబ దోపిడీని కళ్ళకు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో తరుము తరుము తరుముడే రామక్క, దొరను ఉరిమి తరుముడే రామక్క అంటూ ప్రజలు కేసీఆర్ ను ఈ ఎన్నికల్లో తరిమికొట్టాలని సందేశం ఇస్తున్నారు. కమీషన్ల సర్కరమ్మ అంటూ కేసీఆర్ కుటుంబం కమీషన్ లేనిదే పని చెయ్యరని చెప్పే ప్రయత్నం పాట ద్వారా చేశారు.
మొత్తంగా పాటలను కూడా వదలకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగుతున్న ప్రచ్చన్న పోరు ఇప్పుడు తెలంగాణలో ఆసక్తికరంగా మారుతుంది. మరి ఈ పోరులో ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications