కాంగ్రెస్ లో షర్మిల హోదా ఖరారు - పోటీ స్థానంపై కొత్త ట్విస్ట్..!!

కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం ముహూర్తం ఖరారైంది. రెండు పార్టీల మధ్య ఈ మేరకు అవగాహన కుదిరింది. కాంగ్రెస్ లో షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయం పూర్తయింది. షర్మిల కోరిక మేరకు తెలంగాణలో ప్రాధాన్యత ఇవ్వనుంది. అదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వం సూచన మేరకు ఏపీలోనూ షర్మిల కీలక పాత్ర పోషించనున్నారు. సోనియాతో భేటీ ఆ వెంటనే పార్టీ విలీనం ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోంది.

కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు:వైఎస్సార్టీపీ ఇక కాంగ్రెస్ లో విలీనం కానుంది. ఈ మేరకు దాదాపుగా అధికారిక నిర్ణయం జరిగింది. ఈ మేరకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పూర్తి మంత్రాంగం నడిపారు. షర్మిల - కాంగ్రెస్ నాయకత్వం మధ్య మధ్యవర్తిత్వం వహించారు. ఫలితంగా షర్మిల కోరుకున్నట్లుగా తెలంగాణ నుంచి పోటీ... కాంగ్రెస్ కోరుతున్నట్లుగా ఏపీలోనూ బాధ్యతలకు షర్మిల అంగీకరించారు. ఫలితంగా ఈ నెల 12న షర్మిల ఢిల్లీలో సోనియాతో సమావేశం కానున్నారు. ఆ తరువాత రాహుల్ తో భేటీ అయ్యేలా షెడ్యూల్ ఖరారైంది. దీంతో తన తండ్రి ఆయన సాధనే లక్ష్యంగా పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల రాజకీయంగా సక్సెస అవ్వటంలో విఫలం అయ్యారు. ఫలితంగా పార్టీని విలీనం దిశగా నిర్ణయం తీసుకున్నారు.

Congress decided to Give key post for YS Sharmila, likely to contest from Secunderabad in next Elections

పోటీ స్థానంలో కొత్త మెలిక:కర్ణాటక తరువాత తెలంగాణలో అధికారం పైన కాంగ్రెస్ హైకమాండ్ పట్టుదలతో అడుగులు వేస్తోంది. ఏ ఒక్క అవకాశం వదులుకోకూడదని భావిస్తోది. అందులో భాగంగా షర్మిలతో మంతనాలు మొదలయ్యాయి. షర్మిల నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. తొలుత పొత్తుల దిశగా చర్చలు జరిగినా, ఆ తరువాత విలీనం చేయాలంటూ కాంగ్రెస్ నుంచి ఒత్తిడి పెరిగింది.

ఈ క్రమంలో తెలంగాణతో పాటుగా ఏపీలోనూ షర్మిల సేవలను వినియోగించుకొనేలా కాంగ్రెస్ ఒప్పించింది. కాంగ్రెస్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ స్టార్ క్యాంపెయినర్ గా షర్మిలను నియమిస్తూ..పార్టీలోకి కీలక పదవి ఇవ్వాలని డిసైడ్ అయింది. తెలంగాణలో పాలేరు నుంచి షర్మిల పోటీకి సిద్దమయ్యారు. ఇందుకు తొలుత అంగీకరించిన కాంగ్రెస్, ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి పోటీకి సిద్దం కావాలని సూచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Congress decided to Give key post for YS Sharmila, likely to contest from Secunderabad in next Elections

ఏపీలో టార్గెట్ ఫిక్స్:విలీనం వేళ సీటు పైన కాంగ్రెస్ ఇచ్చిన ఈ ట్విస్టు పైన చర్చ సాగుతోంది. షర్మిలకు నేరుగా ఏఐసీసీలో పదవి ఇచ్చేలా నిర్ణయం ప్రకటిస్తారని చెబుతున్నారు. తెలంగాణలో షర్మిల పోటీ చేయటానికి టీపీసీసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినా..కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ఎన్నికల్లోనే శక్తి మేర పని చేయాలని షర్మిలకు కాంగ్రెస్ నాయకత్వం సూచిస్తోంది.

తెలంగాణ ఎన్నికలు పూర్తయిన తరువాత పూర్తి స్థాయిలో ఏపీలో పని చేసేలా షర్మిలను ఒప్పించారు. అక్కడ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా వైసీపీ ఓట్ బ్యాంక్ ను తమ వైపు తిప్పుకోవటమే లక్ష్యంగా షర్మిల ప్రచారం చేయనున్నారు. దీంతో, కాంగ్రెస్ లో విలీనం తరువాత ప్రధానంగా వైసీపీ పైన షర్మిల ఏ రకంగా ముందుకు వెళ్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+