Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్ ధరణి అదాలత్ లు.. రేవంత్ నయా వ్యూహం; టార్గెట్ కేసీఆర్ సర్కార్!!

పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధరణి అదాలత్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ సర్కార్ టార్గెట్ గా ధరణి అదాలత్ లతో కాంగ్రెస్ రంగంలోకి దిగుతుంది

తెలంగాణా రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చెయ్యటానికి కాంగ్రెస్ పార్టీ సరికొత్త కార్యక్రమంలో ముందుకు పోతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ లో ఉన్న సమస్యల నుండి ప్రజలను విముక్తులను చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధరణి అదాలత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ గ్రామంలో నిర్వహించిన ధరణి అదాలత్ లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, జైరాం రమేశ్, కొప్పుల రాజు,టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు,పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య మహేశ్ కుమార్ గౌడ్, తదితర నేతలు పాల్గొన్నారు.

ధరణి పేరుతో పేదల భూములను లాక్కుంటుంది: మాణిక్ రావ్ థాక్రే

ధరణి పేరుతో పేదల భూములను లాక్కుంటుంది: మాణిక్ రావ్ థాక్రే


ఈ సందర్భంగా సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన 32 మంది ధరణి పోర్టల్ తో నష్టపోయిన వారికి కాంగ్రెస్ నాయకులు హామీ కార్డులు అందజేసారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 100 రోజుల్లో వారి సమస్యలు పరిష్కరించి వారి భూములు వారికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని నాయకులు బాధితులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్, రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే మాట్లాడుతూ కేసీఆర్ సర్కారు ధరణి పేరుతో పేదల భూములను వారికి కాకుండా చేస్తోంది అని అన్నారు.

పేదలకు కేసీర్ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది : మాణిక్ రావు థాక్రే

పేదలకు కేసీర్ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది : మాణిక్ రావు థాక్రే


మీ భూ హక్కులు మీరు తిరిగి కల్పించేందుకుకాంగ్రెస్ ఈ కార్యక్రమం చేపట్టిందని పేర్కొన్నారు. పేదలకు కేసీర్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అని ఆయన అన్నారు. పేదల భూములు వారికి చెందేలా చేసే వరకు ధరణి అదాలత్ కార్యమాన్ని కొనసాగిస్తామన్నారు. రానున్న రోజుల్లో ధరణిపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఠాక్రె తెలిపారు. తెలంగాణలో 2024 ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరణి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

 12 వేల గ్రామాలలో ధరణి అదాలత్ లు: రేవంత్ రెడ్డి

12 వేల గ్రామాలలో ధరణి అదాలత్ లు: రేవంత్ రెడ్డి


ధరణి ద్వారా 9 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. 70 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ రైతుల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిందని, అటవీ హక్కుల చట్టం తీసుకువచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలోని 12 వేల గ్రామాలలో ధరణి అదాలత్ నిర్వహించి బాధితుల నుండి దరఖాస్తులు స్వీకరించి, వారికి గ్యారెంటీ కార్డులు పంపిణీ చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ పేదల కోసం కాదని, భూస్వాముల కోసం మాత్రమేనని రేవంత్ రెడ్డి విమర్శించారు. ధనవంతుల కోసమే కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకువచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+