Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొండా పై పార్టీ క్రమశిక్షణా సంఘం అనూహ్య నిర్ణయం..!?

తెలంగాణ కాంగ్రెస్ లో కొండా వివాదం సంచలనంగా మారుతోంది. కొండా దంపతుల పైన కాంగ్రెస్ వరంగల్ జిల్లా నేతలు చేసిన ఫిర్యాదుల పై పార్టీ ఫోకస్ చేసింది. క్రమశిక్షణా సంఘం ఈ ఫిర్యాదు లపైన విచారణ మొదలు పెట్టింది. కొండా వ్యాఖ్యలు.. తదనంనతర పరిణామాల పైన ఆరా తీసిన కమిటీ.. ఈ వివాదం పైన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇతర నియోజకవర్గాల్లో పార్టీలో నెలకొన్న వివాదాల పైన చర్చించింది. దీంతో, కొండా దంపతుల పైన పార్టీ తీసుకొనే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

కొండా మురళీ సొంత పార్టీ నేతల పైన చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు నేరుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేసారు. కొండా దంపతుల పైన చర్యలు తీసుకుంటారా.. లేక, తమ నిర్ణయం తామే తీసుకోవాలో తేల్చి చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ వివాదం పైన పార్టీ పరిశీలకుల నుంచి నివేదిక కోరామని.. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే అంశం పైన కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం భేటీ అయింది. కొండా సురేఖ పై ఫిర్యాదుల పై చర్చించింది. కొండా వ్యాఖ్యలు.. పార్టీ నేతల ఫిర్యాదుల పైన ఆరా తీసింది. కొండా కు సంజాయిషీ నోటీసులు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

congress disciplinary committee seek Explanation from Konda over latest contrvoersy

ఇక, శనివారం మరోసారి క్రమశిక్షణా సంఘం భేటీ కావాలని నిర్ణయించింది. ఈ రోజు జరిగిన సమావేశంలో కొండా వివాదంతో పాటుగా ఆసీఫాబాద్ పరిణామాల పైన చర్చ చేసినట్లు పార్టీ నేతల సమాచారం. అటు స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతున్న సమయంలో సొంత పార్టీ నేతల పైన వ్యాఖ్యలు చేయటం.. వివాదాలు ఏంటని ఇప్పటికే పార్టీ పరిశీలకులు కొండా పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదే సమయంలో పార్టీ నేతలెవరూ మీడియాలో మాట్లాడవద్దని.. పార్టీలో ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించిన చర్యలు ఉంటాయని మీనాక్షీ నటరాజన్ హామీ ఇచ్చారు. పార్టీ నేతల సమాచారం ప్రకారం కొండా మురళీ పైన చర్యలకు పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు పార్టీకి కొండా దంపతులు ఎలాంటి వివరణ ఇస్తారనేది కీలకంగా మారుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ లో సంచలనంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+