హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బంజారా భవన్ నిర్మాణం ఏదీ?: మొక్క నాటిన షబ్బీర్ అలీ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌ మండలిపక్ష నేత షబ్బీర్‌ అలీ తనదైన శైలిలో విమర్శించారు. ఓట్ల కోసం సీఎం కేసీఆర్ కోతలు కోస్తున్నారని, ఆచరణ సాధ్యంకాని హామీలు గుప్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆదివారం బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్ 10లోని ఎకరం స్థలంలో బంజారాభవన్‌ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ గతేడాది శంకుస్థాపన చేసినా పనులు ఇంకా ఆరంభం కాని విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

దీనిని నిరసిస్తూ షబ్బీర్ అలీ, కాంగ్రెస్ పార్టీ నేతలు మర్రిశశిధర్‌రెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్‌, దానం నాగేందర్‌ ఆదివారం ఆ స్థలంలో మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షబ్బీర్ అలీ అభివృద్ధి పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో శంకుస్థాపన చేసిన జీవోలను విడుదల చేస్తోందన్నారు.

బంజారా భవన్ నిర్మాణం ఏదీ?: మొక్క నాటిన షబ్బీర్ అలీ

బంజారా భవన్ నిర్మాణం ఏదీ?: మొక్క నాటిన షబ్బీర్ అలీ

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌ మండలిపక్ష నేత షబ్బీర్‌ అలీ తనదైన శైలిలో విమర్శించారు. ఓట్ల కోసం సీఎం కేసీఆర్ కోతలు కోస్తున్నారని, ఆచరణ సాధ్యంకాని హామీలు గుప్పిస్తున్నారని ఆయన ఆరోపించారు.

బంజారా భవన్ నిర్మాణం ఏదీ?: మొక్క నాటిన షబ్బీర్ అలీ

బంజారా భవన్ నిర్మాణం ఏదీ?: మొక్క నాటిన షబ్బీర్ అలీ

అయితే వాటి ఆచరణలో మాత్రం పూర్తిగా విఫలమవుతోందని ఆయన మండిపడ్డారు. గూగుల్‌ మ్యాప్‌ ముందర పెట్టుకొని ప్రాజెక్ట్‌ల డిజైన్లను రోజుకో విధంగా మారుస్తున్నారని, దీనికి ఎంఐఎం నేతలు వంత పాడుతున్నారని మండిపడ్డారు.

బంజారా భవన్ నిర్మాణం ఏదీ?: మొక్క నాటిన షబ్బీర్ అలీ

బంజారా భవన్ నిర్మాణం ఏదీ?: మొక్క నాటిన షబ్బీర్ అలీ

మహారాష్ట్రలో జన్మించిన ఎంఐఎం నేతలు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అనంతరం మాట్లాడిన మర్రి శశిధర్ రెడ్డి అభివృద్ధి కోసం జీవోలు తీస్తున్న ప్రభుత్వం వాటి అమలులో పూర్తిగా విఫలమైందన్నారు.

బంజారా భవన్ నిర్మాణం ఏదీ?: మొక్క నాటిన షబ్బీర్ అలీ

బంజారా భవన్ నిర్మాణం ఏదీ?: మొక్క నాటిన షబ్బీర్ అలీ

తాను మంత్రిగా ఉన్నప్పుడు నందినగర్‌లో రూ. కోటితో బంజారాభవన్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి జీవోను కూడా తెచ్చామని గ్రేటర్‌ అధ్యక్షుడు దానం నాగేందర్‌ గుర్తుచేశారు. అయితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దానిని రద్దు చేసి రోడ్డు నంబరు 10లో శంకుస్థాపన చేసిందన్నారు.

English summary
The Congress leaders planted saplings at the very site where the Chief Minister laid foundation stones for Banjara Bhavan, Kommaram Bheem Advasi Bhavan and Babu Jagjeevanram Bhavan on Road No. 10, Banjara Hills on December 11, 2014. All three foundation stones had no plaques, which were reportedly removed following a dispute over the land ownership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X