కాంగ్రెస్ పార్టీ తీరు వల్లే దేశంలోని ప్రతిపక్షాలు ఓటమి పాలయ్యాయి :సురవరం సుధాకర్ రెడ్డి
దేశంలోని ప్రతిపక్షపార్టీలను ఏకం చేసి ఎన్డీఏకు వ్యతిరేకంగా కూటమీ ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని సీపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తీరువల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇక ప్రతిపక్షాలన్ని ఎకమైన తమిళనాడులో బీజేపీని నిలువరించామని ఆయన తెలిపారు. మరోవైపు దేశంలో కమ్యునిస్టుల ఓటమీ దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు.
జాతీయ వాదం ,భావోద్వేగాల నేపథ్యంలోనే ప్రజలు ఏన్డీఏకు పట్టం కట్టారని అన్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గం సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను ఆయన వివరించారు.కాగా జాతీయ స్థాయిలో ఒకప్పుడు చక్రం తిప్పిన వామపక్ష పార్టీలు ప్రస్థుతం లోక్‌సభలో ప్రాంతీయ పార్టీలకు ఉన్న ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీపిఐ 2 స్థానాలను కైవసం చేసుకోగా సీపీఎం 4 స్థానాలను గెలుచుకుంది.













Click it and Unblock the Notifications