నాకు పెళ్లయింది, కానీ రాహుల్ గాంధీకి పెళ్లి కాలేదుగా, అతని మాటేమిటి: కేటీఆర్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీయే శత్రువు అని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం మండిపడ్డారు.

1969లో తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసి ఆ పార్టీ ద్రోహం చేసిందన్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తమ పార్టీతో పొత్తు పెట్టుకొని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత మోసం చేసిందన్నారు.

Congress is first enemy of Telangana

కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డిలు హుందాగా మాట్లాడాలని హితవు పలికారు. చిత్తూరు జిల్లాకు రూ.9 వేల కోట్లతో మంచి నీటి పథకం మంజూరు చేస్తే అప్పట్లో ఈ నేతలు మంత్రులుగా ఉండి ఏం చేశారని ప్రశ్నింటారు.

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇవ్వాల్సిన అనివార్యతను కల్పించామని చెప్పారు. ప్రభుత్వం ఏ పని చేపట్టినా కాంగ్రెస్ నేత‌లు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంక్షేమ పథకాలపై సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీ నేతలు తనను బచ్చా అంటున్నారన్నారు. తనకు పెళ్లి అయిందని పెళ్లి కాని రాహుల్ గాంధీ బచ్చా కాదా? అని ఎద్దేవా చేశారు.

Kadiyam Srihari suffers sunstroke at Telangana anniversary celebrations

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Minister Kalvakuntla Taraka Rama Rao on Monday said that Congress party is the first enemy of the Telangana state.
Please Wait while comments are loading...