కాంగ్రెస్‌కు మరో షాక్: కారెక్కనున్న మాజీ మంత్రి గడ్డం ప్రసాద్
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెసు పార్టీకి మరో షాక్ తగులుతోంది. స్థానిక సంస్థల ఎన్నిలకు పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో టిఆర్ఎస్ కాగ్రెసు పార్టీకి షాక్ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి గడ్డం ప్రసాదకుమార్ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరబోతున్నారు.
ప్రసాద్ కుమార్‌ను పార్టీలో చేర్చుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. నిజానికి ఆయన కాంగ్రెసు నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఆశించారు. అయితే, రంగారెడ్డి జిల్లాలో రెండో ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి టిఆర్ఎస్‌కు సంఖ్యాబలం అవసంర ఉంది. దీంతో ఓ మంత్రి రంగంలోకి దిగి గడ్డం ప్రసాద్ కుమార్‌కు గాలం వేసినట్లు తెలుస్తోంది.
ప్రసాద్ కుమార్‌తో పాటు 30 మంది ఎంపిటీసిలు, కౌన్సిలర్లు టిఆర్ఎస్‌లో చేరబోతున్నారు. తద్వారా రంగారెడ్డి జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలను కూడా గెలుచుకోవడానికి టిఆర్ఎస్ నాయకత్వం వ్యూహరచన చేసింది.

ప్రసాద్ కుమార్‌కు టిఆర్ఎస్‌లో అధిక ప్రాధాన్యం ఇవ్వడానికి, అసెంబ్లీ నియోజకవర్గం బాధ్యతలను అప్పగించడానికి టిఆర్ఎస్ నాయకత్వం అంగీకరించినట్లు సమాచారం. ప్రసాద్ కుమార్ ముఖ్య అనుచరుడికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కూడా ఇవ్వడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. టిఆర్ఎస్‌లో చేరే విషయంపై ప్రసాద్ కుమార్ గురువారం తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు.
అయితే, టిఆర్ఎస్‌లో చేరే విషయంపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు. గురువారం వికారాబాదులో జరిగే సమావేశంలో కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications