ఆ కుంభకోణాల్లో కెసిఆర్ కుటుంబసభ్యులు, బంధువులే: విహెచ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ తర్వాత స్వాధీనం చేసుకున్న కోట్లాది రూపాయలు ఏమయ్యాయని ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు ప్రశ్నించారు.

నయీం ఎన్‌కౌంటర్ సమయంలో పలు స్థావరాల్లో చేసిన సోదాల్లో కోట్లాది రూపాయల నగదు, కిలోల కొద్దీ బంగారం దొరికిందని 'సిట్' అధికారులు తెలిపారని విహెచ్ గుర్తు చేశారు. నయీం కేసు పెద్ద కుంభకోణం అని గతంలోనే తాను చెప్పానని విహెచ్ ప్రస్తావించారు. ఈ విషయాన్ని 'సిట్' అధికారులకు, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కూ ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు.

నయీం కేసు: రంగంలోకి ఈడీ, ఏం జరుగుతోంది?

నయీం డెన్‌ల నుండి స్వాధీనం చేసుకొన్న ఆ సొమ్మును కోర్టుకైనా దాఖలు చేసిందా? అనేది పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మాయ మాటలు చెబుతున్నారని ఆయన విమర్శించారు.

Congress leader V. Hanumantha Rao slams on Telangana Cm Kcr

నయీం కేసు విచారణ పేరిట కొన్ని రోజులు, ఆ తర్వాత మియాపూర్ భూముల కుంభకోణం, కొంత కాలం డ్రగ్స్ ఇలా ఏదో అంశాన్ని తెరపైకి తెచ్చి కాలం గడుపుతున్నారని ఆయన అన్నారు.రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ సభ్యులు, బంధువులే ఉన్నారని ఆయన ఆరోపించారు.

నయీం ప్రధాన అనుచరుడి హత్యకు కుట్ర, ప్రదీఫ్‌రెడ్డి అరెస్ట్

ఇలాఉండగా మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) మీడియాతో జిహెచ్‌ఎంసి పరిథిలోని రోడ్ల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు చిన్న వర్షానికే రోడ్లన్నీ జలమయమై, చెరువులను తలపిస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మారు వేషంలో తిరిగి ప్రజల, వాహనదారుల సమస్యలను తెలుసుకోవాలని ఆయన కోరారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AICC member V. hanumantha Rao made allegations on Telangana Cm Kcr on Wednesday at Hyderabad.He asked that where is money seized from gangstar Nayeem's den.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి