Vijayashanti: తెలంగాణ ప్రజలు కేసీఆర్‍పై దండయాత్ర చేయాలని పిలుపునిచ్చిన విజయశాంతి

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. కేసీఆర్ ను మరోసారి గద్దెనెక్కించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలపై దండయాత్ర చేసిందన్నారు. అలంపూర్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రాజెక్టులు, ధరణి పోర్టల్, గ్రానైట్ బిజినెస్, డ్రగ్స్, మందు, గంజాయి సరఫరాతో ప్రజలపై దండయాత్ర చేసి దోపిడీ చేశారని విజయశాంతి పేర్కొన్నారు. 317 జీవో తో ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం చేశారని గుర్తు చేశారు. యువత, నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు.

కేసీఆర్, ఆయన కూతురు, కొడుకు, అల్లుడు వారి బినామీలు తెలంగాణలోని నాలుగు కోట్లు జనాభాను దోచుకుతిన్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు తిన్నారని విమర్శించారు. కేసీఆర్ అవినీతే ఆయన ప్రభుత్వాన్ని కూలదోస్తుందని జోస్యం చెప్పారు. బీజేపీ.. 420గాళ్లతో చేతులు కలిపిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ గెలిస్తే.. తెలంగాణ ప్రజలు మరోసారి దోపిడీకి గురవుతారని అన్నారు. కాంగ్రెస్ ను గెలిపించి దోపిడీకి చరమగీతం పాడి తెలంగాణ ప్రజలను రక్షించాలని విజయశాంతి ప్రజలను కోరారు.

Congress leader Vijayashanthi said that people of Telangana should fight against KCR

కేసీఆర్ పై నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు దండయాత్ర చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల రూపాయల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ఈ రోజు కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోయే విధంగా ఉంది. కాళేశ్వరం కేసీఆర్ ను కాటేసే కాటేశ్వరం అవుతుందన్నారు. కాళేశ్వరం ప్రభుత్వాన్ని కాటికి పంపించే ఈశ్వరం అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇస్తుందన్నారు. అవి యువకులు, మహిళలు, రైతులు, వృద్ధులు పనికొచ్చివేవిగా ఉన్నాయి.

కేసీఆర్ అవినీతిపై బీజేపీ మాట్లాడుతుంది కానీ చర్యలు తీసుకోవడం లేదని విజయశాంతి అసహనం వ్యక్తం చేశారు. అందుకే తాను పార్టీ మారానని తెలిపారు. ప్రజల సమస్యలను తాను తెలుసుకున్నానని, కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యల పరిష్కారానికి ఆరు హామీలు ఇచ్చిందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+