సిరిసిల్లకెళ్తామా: కేటీఆర్‌కి జీవన్ సవాల్, అలీ ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పైన కాంగ్రెస్ పార్టీ నేతలు జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీలు సోమవారం విరుచుకుపడ్డారు. వాటర్ గ్రిడ్ పథకాన్ని రూ.10వేల కోట్లతో పూర్తి చేయవచ్చునని మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు.
కానీ, రూ.25 కోట్ల నుండి రూ.40వేల కోట్లకు ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు. విపక్షాలు కేటీఆర్, కేసీఆర్‌లు చెప్పినట్లు మాట్లాడాలా అని ప్రశ్నించారు.

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాకనే పల్లె ప్రజలు మంచినీరు తాగుతున్నట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రాణహిత ప్రాజెక్టును అటకెక్కిస్తున్నారని ధ్వజమెత్తారు. సిరిసిల్లలో మంచినీటి సరఫరాను పరిశీలిద్దామా అని కేటీఆర్‌కు సవాల్ చేశారు.
నల్లగొండ కాల్పుల ఘటనపై ఎంపీ వ్యాఖ్యలు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నల్లగొండ కాల్పుల ఘటనపై ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం స్పెషల్ పార్టీ పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు ఇస్తుందని, సివిల్ పోలీసులకు ఇవ్వదని పేర్కొన్నారు. సివిల్ పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు ఇస్తే ప్రజలు భయపడతారన్నారు.












Click it and Unblock the Notifications