Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రామోజీరావును కలిసిన కాంగ్రెస్ నేతలు

తెలంగాణలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. నవంబరు మూడో తేదీన పోలింగ్.. ఆరోతేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నియోజకవర్గాన్ని దక్కించుకునేందుకు భారతీయ జనతాపార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్.. మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. వచ్చే సంవత్సరం జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మవిశ్వాసంతో పాల్గొనాలంటే మునుగోడును బీజేపీ సెమీఫైనల్ గా భావిస్తోంది. అన్ని పార్టీలకన్నా ఆ పార్టీకి గెలిచి తీరాల్సిన పరిస్థితి ఉంది.

రామోజీరావును కలిసిన పీసీసీ నేతలు

రామోజీరావును కలిసిన పీసీసీ నేతలు


బీజేపీకి అనుకూలంగా ఒక వర్గం మీడియా ఉండటంతో వారికి ప్రచారానికి సంబంధించిన ఇబ్బంది ఎదురవడంలేదు. అలాగే టీఆర్ఎస్ కు సొంత మీడియా ఉండటంతో ఆ పార్టీ కూడా జోరుగా ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎటువంటి మీడియా లేదు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన తర్వాత కొందరు మీడియా అధినేతలను కలిసి కవరేజీ ఇవ్వమని అభ్యర్థించారు. తాజాగా మూవీ మొఘల్ రామోజీరావును రేవంత్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్, భట్టి విక్రమార్క పలువురు నేతలు ఆయన్ను కలిశారు.

జోడో యాత్ర కవరేజీకే..

జోడో యాత్ర కవరేజీకే..


మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండటంతో దీనిపై కవరేజీ ఇవ్వమని అడగటానికి పీసీసీ నేతలంతా వెళ్లారు.. అనే ప్రచారం నడించింది. అయితే ఎన్నికల విషయమై వారిమధ్య ఎటువంటి చర్చ జరగలేదు. రాహుల్ గాంధీ చేస్తున్న 'భారత్ జోడో యాత్ర' గురించే చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 'భారత్ జోడో యాత్ర' ఏపీలో జరుగుతోంది. నాలుగు రోజుల అనంతరం కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి తెలంగాణలోకి ప్రవేశించి 14రోజులపాటు రాష్ట్రంలో జరుగుతుంది. రాహుల్ పాదయాత్రపై కవరేజీ ఇవ్వమని అడగటం కోసమే వీరు రామోజీరావును కలిశారు. ''మీ పని మీరుచేయండి.. మా పని మేం చేస్తాం'' అని ఆయన అన్నట్లుగా తెలిసింది.

బీజేపీకే కవరేజీ ఇస్తున్న జాతీయ మీడియా?

బీజేపీకే కవరేజీ ఇస్తున్న జాతీయ మీడియా?


జాతీయస్థాయిలో మీడియా బీజేపీకే కవరేజీ ఇస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోవడంతోపాటు ఆ పార్టీలోని నేతల మధ్య కలహాలతో రోజురోజకూ బలహీనపడుతోంది. కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'ను తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభించారు. ఆరునెలలపాటు యాత్ర సాగి కాశ్మీర్ లో ముగియనుంది. ఏ రాష్ట్రానికా రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న ప్రాంతీయ మీడియా యాజమాన్యాన్ని ఆయా రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు కలిసి కవరేజీ కోసం విన్నవిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+