హైకోర్టు తీర్పు కాపీని ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన కోమటిరెడ్డి, సంపత్‌కుమార్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు హైకోర్టు ఇచ్చిన తీర్పును కాపీని కేంద్ర ఎన్నికల సంఘానికి శుక్రవారం నాడు అందించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వాలను రద్దు చేస్తూ తెలంగాణ స్పీకర్ మధుసూధనాచారి తీసుకొన్న నిర్ణయాన్ని రెండు రోజుల క్రితం హైకోర్టు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకొంది.
ఇద్దరు శాసనసభ్యులు వెంటనే ఎమ్మెల్యేలుగా కొనసాగుతారని హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు సుమారు 170 పేజీల తీర్పును వెలువరించింది. ఈ తీర్పు కాపీలను కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌కుమార్‌లతో పాటు న్యాయవాది జంధ్యాల శంకర్ కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డిలు శుక్రవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు తీర్పు కాపీని అందించారు.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ నరసింహాన్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెడ్‌ఫోన్ విసిరేశాడు. అయితే ఈ హెడ్‌ఫోన్ తాకడంతో మండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ కంటికి గాయమైంది. అయితే ఈ విషయమై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌కుమార్‌ల ఎమ్మెల్యే సభ్యత్వాలను రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకొన్నారు.
ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించడంతో ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ స్పీకర్ తీసుకొన్న నిర్ణయాన్ని కోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవద్దని ఈసీని కోరినట్లు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.సెక్షన్ 150 ప్రకారం ఎమ్మెల్యే స్థానాలు ఖాళీలు లేవని ఎన్నికలు నిర్వహించడం లేదని అసెంబ్లీకి లేఖ రాయాలని ఈసీకి చెప్పినట్లు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వివరించారు.












Click it and Unblock the Notifications