తెలంగాణలో మారుతున్న ఈక్వేషన్లు.. ఫోన్ కాల్
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరపడుతోంది. అక్టోబర్/నవంబర్‌లల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావొచ్చు. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ.. సర్వశక్తులను ఒడ్డుతున్నాయి.
ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ.. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో భారీ బహిరంగసభను ఏర్పాటు చేసింది. ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే.. ఇందులో పాల్గొన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు నాయకులు ఇందులో పాల్గొన్నారు.

అదే సమయంలో- బీఆర్ఎస్‌ను ఎదుర్కొనడానికి అవసరమైన పొత్తుల కోసం ప్రయత్నాలు సాగిస్తోంది కాంగ్రెస్. జాతీయ స్థాయిలో పలు కీలక అంశాలపై తమకు అండగా నిలుస్తోన్న కమ్యూనిస్టు పార్టీలను జట్టులో చేర్చుకోనుంది. దీనికోసం ఆ పార్టీ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపనుంది.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ థాక్రే.. నేడు వామపక్ష నేతలను చర్చలకు ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన వారికి ఫోన్ చేశారు. పొత్తులపై చర్చించడానికి రావాలంటూ ఆహ్వానించారు. సీపీఎం, సీపీఐ, ఇతర తొమ్మిది వామపక్ష నేతలు ఈ చర్చల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నిజానికి- మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక సమయంలో వామపక్షాలన్నీ కూడా బీఆర్ఎస్‌కు మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి కృషి చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్.. వారిని దూరం పెట్టింది.
బీఆర్ఎస్ చీఫ్, ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇటీవలే విడుదల చేసిన అభ్యర్థుల జాబితాతో ఈ విషయం స్పష్టమైంది. తాము ఒంటరిగానే ఈ ఎన్నికలకు వెళ్తోన్నామనే సంకేతాలను ఇచ్చారు. ఏఐఎంఐఎంతో స్నేహపూరక పోటీ మాత్రమే ఉంటుందనీ తేల్చి చెప్పారు. వామపక్షాల ప్రస్తావన తీసుకుని రాలేదు. బీఆర్ఎస్ దూరమైన వామపక్షాలతో పొత్తు కోసం కాంగ్రెస్ చొరవ చూపించింది.












Click it and Unblock the Notifications