ఎన్నికల బరిలోకి సీతక్క వారసుడు - సీటు ఖరారు..!?

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క వారసుడు వచ్చేసారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్దమయ్యారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన సీతక్క ప్రస్తుతం ములుగు ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ములుగు నుంచే పోటీకి సిద్దం అవుతున్నారు. ఈ సారి ములుగులో ఎలాగైనా సీతక్కను ఓడించాలనేది బీఆర్ఎస్ లక్ష్యం. ఇందు కోసం కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఇదే సమయంలో సీతక్క కుమారుడు సూర్య వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలవాలని డిసైడ్ అయ్యారు. కొంత కాలంగా ములుగు సరిహద్దు నియోజకవర్గం పినపాక సైలెంట్ గా పని చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పినపాక కాంగ్రెస్ అభ్యర్ధిగా ఇప్పటికే హామీ కూడా దక్కినట్లు చెబుతున్నారు. దీంతో, వచ్చే ఎన్నికల్లో తల్లీ - కుమారుడు ఎన్నికల బరిలో నిలవటం ఖాయంగా కనిపిస్తోంది.

పినపాక నియోజకవర్గంలో 2009లో కాంగ్రెస్ నుంచి రేగా కాంతారావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పాయం వెంకటేశ్వర్లు విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో తిరిగి రేగా కాంతారావు కాంగ్రెస్ నుంచే గెలిచారు. కానీ, టీఆర్ఎస్ లో మారిపోయారు. దీంతో అక్కడ కాంగ్రెస్ కు కొత్త అభ్యర్ధి అవసరమయ్యారు. సీతక్క కుమారుడు సూర్య పినపాక లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అన్ని గ్రామాల్లోనూ పర్యటనలు కొనసాగిస్తున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇప్పటికే హామీ దక్కినా..కాంగ్రెస్ రాజకీయాల్లో చివరి నిమిషం వరకు టికెట్ దక్కేదీ డౌటే. టికెట్ వస్తే..పోటీ చేసి గెలిచి తీరుతాననే ధీమాతో ఉన్నారు.

Congress MLA Seethakka Son Surya likely to contest from congress for Pinapaka seat in next coming Elections

తన నియోజకవర్గంలో సూర్య ఎంట్రీతో, ఎమ్మెల్యే రేగా కాంతారావు ములుగులో సీతక్క పైన కొత్త అస్త్రం ప్రయోగిస్తున్నారు. ఇందు కోసం భద్రాచలం పొడెం వీరయ్యను బీఆర్ఎస్ లోకి తీసుకొచ్చి ములుగులో సీతక్క పైన పోటీకి దింపాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీరయ్య 199,2004లోనూ ములుగు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ములుగులో వీరయ్యకు పట్టు ఉంది. వచ్చే ఎన్నికల్లో ములుగు నుంచి సీతక్క కు గెలుపు అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో రేగా కాంతారావు ములుగు ఆపరేషన్ ప్రారంభించారు. కానీ, వీరయ్య మాత్రం తాను కాంగ్రెస్ వీడనని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ కు ప్రధాన మద్దతుగా దారుగా సీతక్క ఉన్నారు. తాజాగా పార్టీలో పదవుల విషయంలో వచ్చిన పంచాయితీ కారణంగా పార్టీ పదవికి రాజీనామా చేసారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలోనూ పాల్గొన్నారు. కరోనా సమయంలో నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో, వచ్చే ఎన్నికల్లో సీతక్క కుమారుడికి సీటు విషయం పైన ఆసక్తి కర చర్చ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+