కేసీఆర్, అసద్ ను తోలుబొమ్మల్లా ఆడిస్తున్న ప్రధాని మోదీ..!!
తెలంగాణ ఎన్నికల వేళ ప్రధాని మోదీకి షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ వినూన్న ప్రచారం ప్రారంభించింది. ఇప్పటి వరకు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటేనని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు నేరుగా ఎటాకింగ్ కు దిగింది. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన వేళ బీఆర్ఎస్, ఎంఐఎంలను తోలుబొమ్మల్లా ప్రధాని మోదీ ఆడిస్తున్నట్లుగా ఏర్పాటు చేసింది. హైదరాబాద్ ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈ ప్రచారం ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారుతోంది.
కాంగ్రెస్ వినూత్న ప్రచారం : ప్రధాని మోదీ ఈ రోజు హైదరాబాద్ వస్తున్నారు. పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే సభలో పాల్గొంటారు. ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్న కాంగ్రెస్ ఏ ఒక్క అవకాశం వదులుకోవటానికి సిద్దంగా లేదు. తమ ప్రధాని ప్రత్యర్ధి బీఆర్ఎస్ అయినా..బీజేపీ, ఎఐఎం మూడు పార్టీలు కలిసి కట్టుగా పని చేస్తున్నామయనే తమ ఆరోపణలను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తో సహా పార్టీ నేతలంతా కేసీఆర్, మోదీ, అసద్ ఒక్కటేనేని చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్, ఎంఐఎంలను తోలుబొమ్మల్లా ప్రధాని మోదీ ఆడిస్తున్నారనేది కాంగ్రెస్ ఆరోపణ. ఇదే నిజమనే విధంగా గత కొంత కాలంగా తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలను కాంగ్రెస్ నేతలు వివరిస్తున్నారు.

ప్రధాని మోదీ రాక వేళ : తాజాగా కాంగ్రెస్ నేతల పైన జరుగుతున్న ఐటీ దాడుల్లోనూ ఈ మూడు పార్టీలు కలిసి చేస్తున్న కుట్రగా ఆరోపిస్తున్నారు. దీనిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది కాంగ్రెస్ ఆలోచన. అందులో భాగంగా ఎన్నికల ప్రచారంలో డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా ప్రజలకు దగ్గరవుతున్న కాంగ్రెస్ ఇప్పుడు ఈ మూడు పార్టీల బంధం.. బీఆర్ఎస్, ఎంఐఎం ను ప్రధాని మోదీ ఏవిధంగా ఆడిస్తున్నారో తెలియచేసేలా నగరంలోని పలు ప్రాంతాల్లో తోలుబొమ్మలను ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీలను ప్రతిబింబించేలా తోలుబొమ్మలను ఏర్పాటు చేసింది. మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీలను తోలుబోమ్మల్లా ఆడిస్తున్నట్లు ఇందులో కనిపిస్తోంది. హైటెక్ సిటీ, బేగంపేట లాంటి అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ తోలుబొమ్మలను ఏర్పాటు చేసింది.

ఆ ఇద్దరినీ తోలు బొమ్మల్లా ఆడిస్తూ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మార్పు మొదలు..తాజాగా కాంగ్రెస్ నేతల పై ఐటీ దాడుల వరకు అంతా బీఆర్ఎస్ కు సహకరించేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలుగా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎంఐఎం సైతం ఈ రెండు పార్టీలతో జత కలిసిందని విమర్శిస్తోంది. ఎంఐఎం నేతలు ఎక్కడా బీజేపీ, బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేయకపోవటం.. ఎంఐఎం పోటీ చేసే చోట ఆ రెండు పార్టీలు స్నేహ పూర్వక పోటీ అన్నట్లుగా అభ్యర్దులను దించటం ద్వారా వారి మధ్య స్నేహం స్పష్టం అవుతోందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక, ఇప్పుడు ప్రధాని నగరానికి వస్తున్న సమయంలో ఏర్పాటు చేసిన ఈ తోలు బొమ్మలు ఎన్నికల వేళ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతున్నాయి.












Click it and Unblock the Notifications