వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరింత కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ.. మునుగోడు ఉపఎన్నిక ఘోర పరాజయంతో మనుగడ కష్టమేనా!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోతుందా? కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందా? క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పార్టీ పరిస్థితిని చెప్పకనే చెబుతుందా? కాంగ్రెస్ పార్టీ ఓటమికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు, వ్యక్తిగత విభేదాలు, సమన్వయ లోపం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయా? గత ఎన్నికలలో చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని మునుగోడు ఉపఎన్నిక మరింత దిగజార్చిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

అన్ని ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమి.. చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ

అన్ని ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమి.. చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ


ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికలలో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటలేకపోయింది. అనేక స్థానాలలో డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయింది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలలో ఏ ఎన్నికలోనూ తన సత్తా చూపించలేకపోయింది. గతంలో దుబ్బాక, హుజురాబాద్, నాగార్జునసాగర్, హుజూర్నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. తమ సిట్టింగ్ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేకపోయింది. ఇక మునుగోడులో సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకుంటామని చెప్పుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయింది. ఊహించని విధంగా చావు దెబ్బతింది.

కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలివే

కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలివే


కాంగ్రెస్ పార్టీ లో చోటుచేసుకున్న అంతర్గత విభేదాలు, టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ని వ్యతిరేకిస్తున్న వర్గం, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సహకరించకపోవడం, నల్గొండ జిల్లాలో కీలక నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన పాల్వాయి స్రవంతి తరపున ప్రచారం చేయకపోవడం, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైతే ఆ ప్రభావం టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పడుతుందని సీనియర్లు భావించడం వంటి అనేక కారణాలు కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమయ్యాయి.

మునుగోడు ఓటమితో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్ధకం

మునుగోడు ఓటమితో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్ధకం


దీంతో కాంగ్రెస్ పార్టీని ఇతర పార్టీల కంటే, సొంత పార్టీ నేతలే చావుదెబ్బ కొట్టారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు లేకుండా చేశారు అన్న టాక్ వినిపిస్తుంది. అసలే తెలంగాణ రాష్ట్రంలో ప్రాభవాన్ని కోల్పోయి పట్టుకోసం ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తాజాగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో డిపాజిట్లు కూడా రాకుండా ఘోరంగా ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదః పాతాళానికి పడేసింది. ఇప్పటికే మనుగడ కోసం పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తాజా ఎన్నికల ఫలితాలు మరోమారు ఉనికిని ప్రశ్నార్థకం చేశాయి.

కాంగ్రెస్ నేతల్లో మార్పు రాకుంటే కాంగ్రెస్ పార్టీ ఖేల్ ఖతం.. దుకాణం బంద్

కాంగ్రెస్ నేతల్లో మార్పు రాకుంటే కాంగ్రెస్ పార్టీ ఖేల్ ఖతం.. దుకాణం బంద్


ఈ ఎన్నికల ప్రభావం భవిష్యత్తు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీపై తప్పనిసరిగా పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకు రావాలని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా చూపించాలని ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డికి కూడా ఈ మునుగోడు ఉప ఎన్నిక భారీ షాక్ ఇచ్చింది. మరి తాజా పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలపడాలంటే ముందు పార్టీ నేతల మధ్య సఖ్యత అవసరమని, అందరూ సమన్వయంతో పని చేస్తేనే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ప్రజల్లోకి వెళ్లి కలుగుతుందని, అలా కాకుండా పార్టీ నేతల తీరు మారకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేల్ ఖతం.. దుకాణం బంద్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

బీజేపీకి షాక్.. భవిష్యత్ ఎన్నికలపై మునుగోడు ఎఫెక్ట్; అంతర్మధనంలో బీజేపీ నేతలు!!బీజేపీకి షాక్.. భవిష్యత్ ఎన్నికలపై మునుగోడు ఎఫెక్ట్; అంతర్మధనంలో బీజేపీ నేతలు!!

English summary
The defeat in the munugode by-election put the Congress party in more trouble. An opinion is expressed that it is difficult to survive with the heavy defeat of the munugode by-election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X