మిమ్మల్ని ఇంతగా నమ్మితే, మోసం చేస్తారా: కేసీఆర్‌పై జానారెడ్డి ఆగ్రహం
హైదరాబాద్: సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ విమర్శలు చేయడాన్ని ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి శుక్రవారం తప్పుబట్టారు. జానారెడ్డి కాంగ్రెస్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. తమ పార్టీపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు.
కాంగ్రెస్ త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందన్నారు. ప్రజలు కేసీఆర్‌ను నమ్మితే, ఆయన అసెంబ్లీ రద్దు ద్వారా దగా చేశారన్నారు. టీఆర్ఎస్ మాటలతో మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. కేసీఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ముందస్తుకు వెళ్తున్నారన్నారు.

2014లో ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చారని జానా ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల గురించి అడిగితే కేసీఆర్ నుంచి సరైన సమాధానం రాలేదని చెప్పారు. ఎస్సీలకు మూడు ఎకరాల భూమి ఏమయిందన్నారు. టీఆర్ఎస్ పేర్కొన్న ఎన్నికల మేనిఫెస్టోలోని 17 ముఖ్య అంశాల్లో కనీసం 10 కూడా చేయలేదన్నారు.
జెండా ఎగురవేస్తాం: కోమటిరెడ్డి
నల్గొండలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తామని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తాను నల్గొండ నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు. మునుగోడు నుంచి తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తారని తెలిపారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications