వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే.. కేసీఆర్‌కు ఆ సర్వే షాక్!

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందా? ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెరాసకు గట్టి షాక్ తగలనుందా? అంటే అవుననే అంటోంది తెలంగాణ కాంగ్రెస్.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందా? ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెరాసకు గట్టి షాక్ తగలనుందా? అంటే అవుననే అంటోంది తెలంగాణ కాంగ్రెస్.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే దాని పైన సర్వే నిర్వహించింది. దాని ప్రకారం 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు వస్తాయని తేలింది.

40-50 స్థానాల్లో సునాయాసంగా గెలుస్తుందని, మరో 20-30 స్థానాల్లో కాస్త కష్టపడితే గెలుస్తుందని నిర్ధారించింది. ఇరవై స్థానాల్లో ఎంత కష్టపడ్డా గెలిచే అవకాశం లేదని, మిగతా స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని సర్వే తేల్చింది.

<strong>తమిళనాడు - శశికళ ఎఫెక్ట్: గవర్నర్ పైన నారాయణ తీవ్ర వ్యాఖ్యలు</strong>తమిళనాడు - శశికళ ఎఫెక్ట్: గవర్నర్ పైన నారాయణ తీవ్ర వ్యాఖ్యలు

Congress Party survey in Telangana

తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాష్ట్రంలోని 119 నియోజక వర్గాల్లో ముంబై సంస్థతో సర్వే చేయించారు. కొన్ని వివరాలను సోమవారం మధ్యాహ్నం గాంధీ భవన్‌లో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో నేతలకు వెల్లడించారు.

సందర్భంగా ఉత్తమ్‌ జన ఆవేదన సమ్మేళాలు నిర్వహించాల్సిన తీరును వివరిస్తూనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పట్ల ఆదరణ చూపుతున్నారని తెలిపారు.

ముంబైకి చెందిన ఒక సంస్థతో సర్వే నిర్వహించానని, అందులో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం కనిపించిందన్నారు. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్‌ కొంత బలహీనంగా ఉన్నట్లు కనిపించిందని, దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని భావిస్తున్నారు.

పోటాపోటీగా ఉన్న స్థానాలతో పాటు ఓడిపోయే అవకాశాలున్న స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పార్టీ భావిస్తోంది. నలుగురైదుగురు సీనియర్లతో నియోజక వర్గాల వారీగా టాస్క్‌ఫోర్స్‌ను వేయాలని అనుకుంటోంది.

కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించిన వారి సీట్లన్నీ తిరిగి కాంగ్రెస్‌ గెలుచుకుంటుందని సర్వేలో తేలినట్లు తెలిసింది. మిగతా స్థానాలను కూడా కాంగ్రెస్‌ కైవసం చేసుకునేలా హైపవర్‌ కమిటీని వేయాలనుకుంటున్నారు.

English summary
Congress Party chief Uttam Kumar Reddy said that Congress party will win 70 seats in Telangana state if elections held today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X