హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేవంత్‌రెడ్డి అరెస్ట్‌పై హైకోర్టులో పిటిషన్, కేసీఆర్! నీ కూతురు బెడ్రూంలోకి వెళ్తే ఊరుకుంటావా:జైపాల్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్టుపై కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు పిటిషన్‌ను స్వీకరించింది. విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మరోవైపు, రేవంత్ రెడ్డి అరెస్టుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జడ్చర్ల సహా పలుచోట్ల నిరసనలు మిన్నంటాయి. కొడంగల్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

రేవంత్ అరెస్టుపై ఎస్పీ అన్నపూర్ణ మాట్లాడారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆయనను అరెస్టు చేశామని చెప్పారు. ఈసీ ఆధేశాల మేరకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. రేవంత్‌ను కస్టడీలోకి తీసుకున్నామని, కేసీఆర్ సభను అడ్డుకుంటామని ఆయన పిలుపునిచ్చాడని గుర్తు చేశారు. కేసీఆర్ సభ ముగిశాక, ఆయన వెళ్లిన వెంటనే విడిచిపెడతామని చెప్పారు.

<strong>కేసీఆర్‌ను అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి ప్రకటన, కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్</strong>కేసీఆర్‌ను అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి ప్రకటన, కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్

 అరెస్ట్ చాలా నీచమైన చర్చ

అరెస్ట్ చాలా నీచమైన చర్చ

ప్రతిపక్షాలను భయపెట్టేందుకే రెవంత్ రెడ్డిని అరెస్టు చేశారని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియా అన్నారు. వారెంట్ కూడా లేకుండా ఎలా అదుపులోకి తీసుకున్నారని ప్రశ్నించారు. తలుపులు బద్దలు కొట్టి బెడ్రూంలోకి వెళ్లి ఎలా అరెస్టు చేస్తారని నిలదీశారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ చాలా నీచమైన చర్య అన్నారు.

ప్రధాని, సీఎం వస్తే అరెస్ట్ చేస్తారా?

ప్రధాని, సీఎం వస్తే అరెస్ట్ చేస్తారా?

రేవంత్ రెడ్డితో పాటు ఆయన నలుగురు సోదరులను, 140 మంది కాంగ్రెస్ నేతలను అరెస్టు చేశారని కుంతియా చెప్పారు. రేవంత్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు మండల కేంద్రాల్లో నిరసనలు తెలపాలని చెప్పారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు వస్తే అరెస్టు చేయాలని ఎక్కడ ఉందో చెప్పాలన్నారు.

ఇచ్చిన బంద్ కాల్ విరమించుకున్నారు

ఇచ్చిన బంద్ కాల్ విరమించుకున్నారు

కేసీఆర్ రాక నేపథ్యంలో రేవంత్ రెడ్డి బంద్ కాల్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అన్నారు. తొలుత ఇచ్చిన బంద్ కాల్‌ను విరమించుకున్నారని చెప్పారు. ఆ తర్వాత నిరసనలకు మాత్రమే పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ప్రజలను ముఖ్యమంత్రి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడన్నారు. రేవంత్ అరెస్టు దుర్మార్గపు చర్య అన్నారు.

కేసీఆర్! నీ కూతురు బెడ్రూంలోకి వెళ్తే ఊరుకుంటావా?

కేసీఆర్! నీ కూతురు బెడ్రూంలోకి వెళ్తే ఊరుకుంటావా?

ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదని జైపాల్ రెడ్డి అన్నారు. సెర్చ్ వారెంట్లు లేకుండానే పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల ఇళ్లలోకి చొరబడుతున్నారని మండిపడ్డారు. పోలీసులు రేవంత్ పట్ల దొంగలతో వ్యవహరించినట్లుగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. తన కూతురు బెడ్రూంలోకి ఇలాగే పోలీసులు వెళ్తే కేసీఆర్ ఊరుకుంటారా అని ఘాటుగా ప్రశ్నించారు.

అరెస్టును ఖండించిన కోదండరాం

అరెస్టును ఖండించిన కోదండరాం

రేవంత్ రెడ్డిపై అర్ధరాత్రి పోలీసుల దాడిని ఖండిస్తున్నామని తెలంగాణ జన సమితి చీఫ్ కోదండరాం అన్నారు. బెడ్రూం తలుపులు పగులగొట్టి బయటకు లాగడం అమానవీయమని చెప్పారు. భయోత్పాతం సృష్టించి ఎన్నికల్లో గెలవాలని తెరాస ప్లాన్ అన్నారు.

అక్రమ అరెస్టులపై హెచ్చరిక

అక్రమ అరెస్టులపై హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో రేవంత్ రెడ్డి అరెస్టుతో అర్థం చేసుకోవచ్చునని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రేవంత్‌ను ఓ తీవ్రవాదిలా అరెస్టు చేస్తారా అని ధ్వజమెత్తారు. అభ్యర్థులను భయపెడుతున్నారని చెప్పారు. అభిప్రాయాలను వెల్లడించే హక్కును ఎలా హరిస్తారని ప్రశ్నించారు. పోలీసులు సంయమనం పాటించాలన్నారు. పోలీసులు రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలన్నారు. అక్రమ అరెస్టులపై పోలీసులను హెచ్చరిస్తున్నామన్నారు. అధికారం, ధనంతో గెలవాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. మధిరలో బహిరంగంగా డబ్బులు పంచుతుంటే చర్యలు లేవన్నారు.

English summary
Revanth Reddy, a top Congress leader in Telangana and the party's candidate from Kodangal, was detained before dawn today for threatening to stop a public meeting of caretaker chief minister K Chandrashekhar Rao in the constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X