కాంగ్రెస్ ధర్నా, జీహెచ్ఎంసీ దగ్గర ఉద్రిక్తత- అరెస్ట్...!!
హైదరాబాద్ లో పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వరుసగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ట్రాఫిక్ కష్టాలతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. రిజరిర్వాయర్లు నిండు కుండల్లా మారాయి. క్రమేణా పరిస్థితి కుదుట పడుతోంది. బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నిరసనకు పిలుపునిచ్చింది. జీహెచ్ఎంసీ కార్యాలయ ముట్టడికి నిర్ణయించటం తో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గన్‌పార్కు నుంచి ర్యాలీగా పార్టీ శ్రేణులు బయలుదేరారు. గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నేతలందరూ జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. ఆఫీసు ముందు బైఠాయించి అధికారుల తీరుకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. దీంతో, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర హై టెన్షన్ ఏర్పడింది. వర్షాలు, వరదలు ఎదుర్కోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించ లేదు.

ర్యాలీగా హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నేతలందరూ జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. ఆఫీసు ముందు బైఠాయించి అధికారుల తీరుకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు దరాబాద్‌ను విశ్వనగరంగా తయారు చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారని, విశ్వనగరం కాదుకదా.. ఇప్పుడు చెత్తనగరంగా తయారు చేశారని విమర్శించారు. నగరాన్ని కాపాడాల్సిన అవసరముందన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యానని, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పుకొచ్చారు.
ఇబ్బందులు పడుతున్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ. 10వేల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నాళాల పూడిక తీయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కమిషనర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. వరద ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో నిమగ్నం కావాలని పార్టీ పిలుపునిచ్చింది.












Click it and Unblock the Notifications