కేంద్రంపై యుద్ధమే.. బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ పిలుపు

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణకు నిధుల కోసం యుద్ధం చేయకతప్పదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసనలో మహేశ్ కుమార్ గౌడ్ తోపాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం ఎంతో సహాయపడుతోందని.. కానీ, కేంద్రం మాత్రం రాష్ట్రంపై వివక్షచూపుతోందని ఆరోపించారు. కేంద్రం వివక్షను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

Congress protests against injustice done to Telangana in the Union Budget

తెలంగాణ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు సాయం చేయాలని పలుమార్లు కేంద్రానికి నివేదికలు ఇచ్చినా పట్టించుకోవాలని మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. నిధుల కేటాయింపుల్లో రాష్ట్రానికి ప్రతి సంవత్సరం అన్యాయం జరుగుతోందన్నారు. జీడీపీలో తెలంగాణ రాష్ట్ర వాటా 5 శాతం ఉన్నప్పటికీ.. రాష్ట్రానికి ఎప్పుడూ మొండిచేయే చూపిస్తున్నారని మండిపడ్డారు.

అన్ని పార్టీు ఏకమై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేంద్రంపై పోరాటానికి బీఆర్ఎస్ నేతలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ నిరసనలో మంత్రి పొన్న ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరోవైపు, శనివారం కూడా కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై మహేశ్ కుమార్ గౌడ్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి అన్యాయం జరిగిందన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్. తెలుగు కోడలైనా కూడా నిర్మలమ్మ తెలంగాణపై ప్రేమ చూపలేదని.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు.

తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చిందని మండిపడ్డారు మహేశ్ కుమార్ గౌడ్. ఇది బీహార్ ఎన్నికల బడ్జెట్‌లా ఉందన్నారు. ఎన్నికల కోసమే బీహార్‌కు నజరానాలు ఇచ్చారన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు.

రాజకీయంగా తెలంగాణను దెబ్బతీయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. 50.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం.. తెలంగాణకు ఒక్కపైసా ప్రత్యేక కేటాయింపు జరపలేదన్నారు. త్వరలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో అక్కడ రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ కేంద్ర బడ్జెట్‌ను ఉపయోగించుకుంటోందని మహేశ్ కుమార్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+