వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిగ్గీకి చేయిచ్చారు, ఇక కేసీఆర్‌తో సిద్ధం! (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఇక ఉద్యమాలు చేపట్టాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది.

పార్టీ బలోపేతానికి సమన్వయ కమిటీని నియమించాలని నిర్ణయించింది. టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన సోమవారం గాంధీ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం వాడిగా వేడిగా జరిగింది.

ఏఐసీసీ నాయకుడు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సిపిపి) కార్యనిర్వాహక సభ్యుడినైన తనను వేదిక పైకి ఆహ్వానించలేదని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

దిగ్విజయ్

దిగ్విజయ్

టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన సోమవారం గాంధీ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం వాడిగా వేడిగా జరిగింది. భేటీకి వస్తున్న దిగ్విజయ్

రేణుక

రేణుక

టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన సోమవారం గాంధీ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం వాడిగా వేడిగా జరిగింది. సమావేశానికి హాజరైన రేణుకా చౌదరి తదితరులు.

పొన్నాల

పొన్నాల

టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన సోమవారం గాంధీ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం వాడిగా వేడిగా జరిగింది. సమావేశానికి వస్తున్న పొన్నాల.

కాంగ్రెస్

కాంగ్రెస్

ఈ సమావేశంలో పలువురు మాట్లాడుతూ.. పార్టీ చతికిలపడి పోయిందన్నారు. సమస్యలపై ప్రజా ఉద్యమాలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ప్రజలు తీవ్ర నిరాశ, నిస్పృహలతో ఉన్నారని పలువురు అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

కేసీఆర్ లోగడ ఇచ్చిన హామీలను అమలు చేసే నమ్మకం తనకూ లేదని దిగ్విజయ్ అన్నారు. తొలుత పొన్నాల లక్ష్మయ్య ప్రసంగిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

ఇందులో భాగంగానే గత నెల 24, 25 తేదీల్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కార్యాచరణ సదస్సు నిర్వహించడం జరిగిందని వివరించారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

ప్రతి నెలా టిపిసిసి సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులను ఆహ్వానించనున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

అదేవిధంగా పార్టీ అనుబంధ విభాగాలను జిల్లా, మండల స్థాయిలో బలపరిచేందుకు నాయకుల, కార్యకర్తల సలహాలు తీసుకునేందుకు ప్రతి నెల ఖచ్చితంగా సమావేశాలు నిర్వహించాలని తెలిపారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ, ఎన్‌ఎస్‌యుఐ నాయకులను ఆహ్వానించాలని సూచించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని, గ్రామ పంచాయతీ కమిటీలను, బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

క్రమశిక్షణా కమిటీఐదుగురు సభ్యులతో పార్టీ క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేసి, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై చర్య తీసుకుంటామని పొన్నాల అన్నారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

ప్రత్యేక శిక్షణా విభాగాన్ని ఏర్పరిచి మానవ వనరులు, స్వల్పకాల కార్యక్రమాలపై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నవని పొన్నాల చెప్పారు.

 కాంగ్రెస్

కాంగ్రెస్

పొన్నాల ప్రతిపాదించిన అంశాలను సభ్యులు ఆమోదించారు. కొప్పుల రాజు మాట్లాడుతూ పార్టీ పదవుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు సముచిత ప్రధాన్యం ఇవ్వాలని అన్నారు.

సన్మానం

సన్మానం

టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన సోమవారం గాంధీ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం వాడిగా వేడిగా జరిగింది. డిగ్గీకి సన్మానం.

కాంగ్రెస్

కాంగ్రెస్

పార్టీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు సమావేశంలో మాట్లాడుతూ జనాభాలో 50 శాతం ఉన్న బిసిలను విస్మరించరాదని అన్నారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన సోమవారం గాంధీ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం వాడిగా వేడిగా జరిగింది. సమావేశంలో మాట్లాడుకుంటున్న పొన్నాల, జైపాల్ రెడ్డి, విహెచ్.

కాంగ్రెస్

కాంగ్రెస్

టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన సోమవారం గాంధీ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం వాడిగా వేడిగా జరిగింది. సమావేశంలో మాట్లాడుతున్న రేణుకా చౌదరి.

కాంగ్రెస్

కాంగ్రెస్

టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన సోమవారం గాంధీ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం వాడిగా వేడిగా జరిగింది. సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్.

పొన్నాల

పొన్నాల

టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన సోమవారం గాంధీ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం వాడిగా వేడిగా జరిగింది. సమావేశంలో మాట్లాడుతున్న పొన్నాల.

English summary
Telangana Congress is ready to fight on TRS government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X