వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల అరెస్ట్, బలవంతంగా తరలింపు: అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత

ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన కేసీఆర్ సమాధానం తమకు సంతృప్తిగా లేదని, త్యాగాలు చేసిన విద్యార్థులు నష్టపోతున్నారని నిరసిస్తూ టిడిపి, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ సభ్యులు సభలోనే ఉండిపోయారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమాధానం తమకు సంతృప్తిగా లేదని, త్యాగాలు చేసిన విద్యార్థులు నష్టపోతున్నారని నిరసిస్తూ టిడిపి, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ సభ్యులు సభలోనే ఉండిపోయారు.

సభను గురువారానికి వాయిదా వేసిన అనంతరం కూడా వారు సభలోనే నిరసన తెలిపారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు, ముఖ్యమంత్రి తమ సంతృప్తికరమైన సమాధానం చెప్పే వరకు సభలోనే ఉంటామని చెప్పారు. దీంతో వారి అరెస్టు చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

Congress, TDP mlas sit in Assembly after adjourne

కాగా, అంతకుముందు శాసన సభ రేపటికి వాయిదా పడింది. బుధవారం సభలో కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర పథకాలపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. అనంతరం సభను రేపు ఉదయానికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ప్రకటించారు.

నోట్ల రద్దు ఎఫెక్ట్: 'బీజేపీలో మోడీ పరిస్థితి బాగా లేదు, తప్పించే ప్రయత్నాలు'నోట్ల రద్దు ఎఫెక్ట్: 'బీజేపీలో మోడీ పరిస్థితి బాగా లేదు, తప్పించే ప్రయత్నాలు'

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తమ ప్రభుత్వం యధాతథంగా కొనసాగిస్తుందని కేసీఆర్ అంతకుముందు సభలో స్పష్టం చేశారు. రీయింబర్స్‌మెంట్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ పథకం యథాతథంగా కొనసాగుతుందన్నారు.

ఎమ్మెల్యేల అరెస్ట్, పార్టీ ఆఫీస్‌లకు తరలింపు

సభలో నిరసన తెలిపిన టిడిపి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎట్టకేలకు సాయంత్రం అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను వారి పార్టీ కార్యాలయం గాంధీ భవన్ తరలించారు. టిడిపి ఎమ్మెల్యేలు రేవంత్ తదితరులను వారి కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు బలవంతంగా తరలించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మద్దతుగా విద్యార్థులు అసెంబ్లీ గేటు వద్ద నిరసన తెలిపారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary
Congress, TDP mlas sit in Assembly after adjourne.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X