వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: 'మోడీకి మద్దతిస్తూ థర్డ్ అంటావా అని.. కేసీఆర్‌కు మమతా బెనర్జీ మొట్టికాయలు'

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మొట్టికాయలు వేశారని కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం షాకింగ్ కామెంట్స్ చేశారు.

బలమైన థర్డ్, ఇది మంచి ప్రారంభం: 2 గంటలపాటు మమత-కేసీఆర్‌ల భేటీబలమైన థర్డ్, ఇది మంచి ప్రారంభం: 2 గంటలపాటు మమత-కేసీఆర్‌ల భేటీ

ప్రధాని నరేంద్ర మోడీకి, బీజేపీకి మద్దతు తెలుపుతూ థర్డ్ ఫ్రంట్ అంటే ఎలా అని మమత ఆయనను నిలదీశారన్నారు. థర్డ్ ఫ్రంట్ పైన కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు వట్టివేనని ఆయన అభిప్రాయపడ్డారు.

Recommended Video

KCR Mamata Banerjee meet : ప్రజల అజెండాగా 'రియల్ ఫెడరల్ ఫ్రంట్'
మమతను చూసి నేర్చుకో

మమతను చూసి నేర్చుకో

మమతా బెనర్జీది సాధారణ జీవితం అని, ఆమెను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ విలాసవంతమైన జీవితానికి స్వస్తీ చెప్పాలని కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. మమతను కేసీఆర్ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జై తెలంగాణ అనని సంతోష్‌కు రాజ్యసభ సీటు కేటాయించారన్నారు.

కుట్రలకు వేదికగా

కుట్రలకు వేదికగా

కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గవర్నర్ నరసింహన్ పైన మండిపడ్డారు. రాజ్ భవన్ రాజకీయాలకు, కుట్రలకు వేదికగా మారిందని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రజల ఆకాంక్షలకు అనుణంగా ప్రసంగం లేనందునే కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారన్నారు.

 మోడీ అజెండా అమలు చేసేందుకే రాజ్ భవన్ వేదిక

మోడీ అజెండా అమలు చేసేందుకే రాజ్ భవన్ వేదిక

నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేశారని, మోడీ అజెండాను అమలు చేసేందుకు రాజ్ భవన్‌ను వాడుకుంటున్నారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గవర్నర్ పదవీకాలం ముగిసినా ఆయననే కొనసాగిస్తారన్నారు. మోడీకి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు.

 రాజ్యసభలో ఓటేస్తారు

రాజ్యసభలో ఓటేస్తారు

అసెంబ్లీలో జరిగిన ఘటనపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అవినీతి బయటపడుతుందనే అసెంబ్లీ, శాసన మండలి నుంచి తమను బయటకు పంపించారన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెడ్ ఫోన్ విసిరితే మండలి స్వామిగౌడ్‌కు గాయమైనట్లుగా చిత్రీకరించారని మండిపడ్డారు. ప్రభుత్వ అడ్వోకేట్ జనరల్ హైకోర్టులో ఆ వాదనే వినిపించలేదన్నారు. కోర్టుపై తమకు నమ్మకం ఉందని, కోమటిరెడ్డి, సంపత్ రాజ్యసభలో ఓటేస్తారన్నారు. మమతతో కేసీఆర్ భేటీ అంతా ఓ స్టంట్ అన్నారు.

English summary
TPCC president Uttam Kumar Reddy termed Chief Minister K Chandrasekhar Rao’s effort to seek West Bengal Chief Minister Mamata Banerjee’s support to the proposed Front at the national level as an attempt to create differences among regional parties, which are opposing BJP-led NDA’s rule.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X