జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్దిగా మళ్లీ ఆయనే, ఢిల్లీ మార్క్ ట్విస్ట్..!?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను తమ అభ్యర్దిగా బీఆర్ఎస్ ప్రకటించింది. అటు బీజేపీ అభ్యర్ధి ఖరారు కోసం కమిటీ ఏర్పాటు చేసింది. ప్రముఖ సినీ నటి బీజేపీ నుంచి బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలోనే కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అభ్యర్ధి ఖరారు పైన మంత్రుల కమిటీ ముగ్గురు పేర్లు సూచించింది. అయితే, ఢిల్లీలో మారుతున్న లెక్కల మేరకు అభ్యర్ధి ఖరారు వేళ ఊహించని ట్విస్ట్ తెర మీదకు వచ్చింది.

జూబ్లీహిల్స్ లో గెలుపు ఇప్పుడు కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇతర పార్టీల కంటే ముందుగానే ఇక్కడ గెలుపు కోసం ముగ్గురు మంత్రులతో కమిటీ... పలువురు నేతలతో ప్రచారం కోసం ఏర్పాట్లు చేసారు. ఎంఐఎం సహకారం పైన అంతర్గతంగా సమీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సీటు నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అజాహరుద్దీన్ తిరిగి పోటీ చేయాలని భావించారు.

congress-to-announce-party-contesting-candidate-for-jubilee-hills-in-next-two-days

కాగా.. అజాహరుద్దీన్ ను ఎమ్మెల్సీగా పంపి.. ఇక్కడ నుంచి బీసీ అభ్యర్ధికి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. తాజాగా ముగ్గురు మంత్రులు సైతం నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, కార్పోరేటర్ సీఎన్ రెడ్డి పేర్లు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. కాగా.. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఇప్పటికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. సీటు కోసం ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ ముమ్మరం చేసారు.

ఇక..అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ఎంపిక చేయటంతో.. నవీన్ యాదవ్ కు టికెట్ ఖాయమన్న ప్రచారం జరిగింది. తన కొడుకు రాజ్యసభ సభ్యుడైతే ఏంటి.. తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అంజన్ కుమార్ యాదవ్ చెబుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు సికింద్రాబాదు ఎంపీ అభ్యర్థిగా ప్రయత్నాలు చేసిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పూర్తిగా సీఎం రేవంత్ పైనే ఆశలు పెట్టుకున్నారు.

మంత్రుల కమిటీ సైతం రామ్మోహన్ పేరును తమ జాబితాలో సిఫారసు చేసారు. కాగా.. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు రేసులోకి వచ్చారు. దీంతో.. కాంగ్రెస్ నాయకత్వం అభ్యర్ధి ఖరారు విషయంలో తర్జన భర్జన పడుతోంది. పార్టీ రాష్ట్ర నేతలు స్థానిక సంస్థలతో పాటుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.

ఈ సమయంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్ధి పైన ఢిల్లీ కేంద్రంగా కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఎంఐఎం అధినేత అసద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సైతం కాంగ్రెస్ కు అనుకూలం గా ఉన్నాయి. బీఆర్ఎస్ మాగంటి కుటుంబానికే సీటు ఇవ్వటం.. బీజేపీ నుంచి సినీ నటి జయసుధ పేరు రేసులోకి రావటంతో ఢిల్లీ కాంగ్రెస్ నాయకత్వం పునరాలోచనలో పడినట్లు పార్టీ నేతల సమాచారం.

ఇదే సమయంలో ఎమ్మెల్సీ పదవి పైన ఉన్న న్యాయపరమైన చిక్కులతో తాను మండలికి వెళ్లటం సాధ్యమేనా అనే సందేహంతో అజాహరుద్దీన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన మద్దతు దారులు సైతం జూబ్లీహిల్స్ నుంచే పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో.. ఢిల్లీలో నేరుగా పార్టీ అధినాయకత్వం వద్ద అజాహరుద్దీన్ తిరిగి ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో.. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్ధి పైన తుది నిర్ణయం పార్టీలో ఉత్కంఠగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+