T Congress రెండో జాబితా సిద్దం, రాజగోపాల్ కు సీటు ఖరారు - లిస్టులో..!!

తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా సిద్దమవుతోంది. తుది కసరత్తు జరగుతోంది. పెండింగ్ స్థానాలకు దాదాపు అభ్యర్దులు ఖరారయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 27న కాంగ్రెస్ లో చేరనున్నారు. బీజేపీకి రాజీనామా చేసారు. రాజగోపాల్ కు మునుగోడు సీటు ఖాయమైందని సమాచారం. ఎల్బీనగర్ సీటు గురించి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 55 స్థానాలకు పార్టీ అభ్యర్దులను ప్రకటించింది. నేటి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో మిగిలిన 64 స్థానాల్లో 40 నుండి 50 అసెంబ్లీ స్థానాలు క్లియర్ అయ్యే అవకాశం ఉంది. సీనియర్లలో ఈ జాబితాపై ఉత్కంఠ కొనసాగుతోంది.

కాంగ్రెస్ రెండో జాబితా:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ రోజు (బుధవారం) భేటీ కానుంది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా... ఈ నెల 15న 55 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల చేసింది. మిగిలిన 64 స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై ఇటీవల రెండుసార్లు భేటీ అయిన స్క్రీనింగ్‌ కమిటీ అభ్యర్థుల ప్రతిపాదనలకు సిద్ధం చేసింది. ఇందులో వామపక్ష పార్టీలతో పొత్తు, వారికి కేటాయించే నాలుగు సీట్లు, మిగిలిన 60 స్థానాలపై స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ ప్రతిపాదనలను బుధవారం ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌, ఇతర నేతల సమక్షంలో జరిగే సీఈసీలో చర్చించి, ఆమోదించనున్నారు. అనంతరం తుది జాబితా విడుదల కానుంది.

Congress to announce second list of 60 candidates in Telangana today

ప్రాబబుల్స్ లిస్టు:రెండో అభ్యర్థుల ప్రాబబుల్స్‌ జాబితా లో జడ్చర్ల: అనిరుధ్‌రెడ్డి\ ఎర్రశేఖర్‌, మహబూబ్‌నగర్‌: యొన్నం శ్రీనివాస్‌రెడ్డి\ ఒబెదుల్లా కొత్వాల్‌, దేవరక్రద- జి.మధుసుధన్‌రెడ్డి\కాటం ప్రదీప్‌గౌడ్‌, మక్తల్‌: శ్రీహరి ముదిరాజ్‌\కొత్తకోట సిద్ధార్థ్‌రెడ్డి, నారాయణపేట: కుంభం శివకుమార్‌\ఎర్ర శేఖర్‌, వనపర్తి- చిన్నారెడ్డి\మేఘారెడ్డి, దేవరకొండ-బాలు నాయక్‌, భువనగిరి- కుంభం అనిల్‌, సూర్యాపేట-పటేల్‌ రమేష్‌/ ఆర్‌.దామోదరరెడ్డి, మిర్యాలగూడ- సీపీఎం,మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, తుంగతుర్తి- అద్ధంకి దయాకర్\ ప్రీతం\వడ్డేపల్లి రవి, ఖమ్మం-తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇల్లందు-కోరం కనకయ్య\ప్రవీణ్‌ నాయక్‌, పినపాక-సూర్యం(సీతక్క కుమారుడు) అశ్వారావుపేట-తాటి వెంకటేశ్వర్లు\ సున్నం నాగమణి ఉన్నట్లు సమాచారం.

Congress to announce second list of 60 candidates in Telangana today

సీనియర్లకు ఛాన్స్ దక్కేనా:ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి నిజామాబాద్‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలకు చెందిన పలువురు నేతలు నేడు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. కొత్తగా పార్టీలో చేరే వీరి కోసం 4-5 స్థానాలను కేటాయించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం స్క్రీనింగ్‌ కమిటీ రూపొందించిన తుది జాబితాలో స్వల్ప మార్పులు, చేర్పులు జరుగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

మాజీ ఎంపీలు పొన్నం హుస్నాబాద్, మధుయాష్కీ - ఎల్బీ నగర్ సీట్లు ఆశిస్తున్నారు. కామారెడ్డి నుంచి రేవంత్ పోటీకి దిగుతారని తెలుస్తోంది. దీంతో, షబ్బీర్ అలీనే కామారెడ్డి బరిలో నిలుస్తారా..మరో స్థానం కేటాయిస్తారా అనేది తేలాల్సి ఉంది. జూబ్లీహిల్స్ స్థానం పైన పార్టీ నాయకత్వం నిర్ణయంపైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+