ఆ లోక్‌సభ సీట్లపై తెలంగాణ కాంగ్రెస్‌లో పేచీ: మండవకు ఖమ్మం టికెట్?

Telangana Lok Sabha Congress Candidates 2024 list: లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వలసలు, చేరికలు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేకించి- ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి వలసల బెడదను ఎదుర్కొంటోంది.

తెలంగాణలో గల 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఒకే విడతలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. 17 లోక్‌సభ స్థానాల్లో అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకున్న విషయం తెలిసిందే.

Congress to finalise Hyderabad Karimnagar and Khammam Lok Sabha candidates today

ఈ ఎన్నికల్లో తన సీట్ల సంఖ్యను భారీగా పెంచుకోవడానికి కాంగ్రెస్ కసరత్తు సాగిస్తోంది. ఇప్పటికే 14 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కూడా. 8వ జాబితాలో నలుగురి పేర్లను ప్రకటించింది. నిజామాబాద్- టీ జీవన్ రెడ్డి, ఆదిలాబాద్- ఆత్రం సుగుణ, మెదక్- నీలం మధు, భువనగిరి- చామల కిరణ్ కుమార్, వరంగల్- కడియం కావ్య అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం.

ఇక మిగిలింది.. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్. ఈ మూడు స్థానాలు కూడా కాంగ్రెస్‌కు కొరుకుడు పడట్లేదు. ప్రత్యేకించి- ఖమ్మం, కరీంనగర్‌లను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్. కీలకంగా మారిన ఈ మూడు చోట్ల అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది.

ఈ మూడు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయడానికి ఇప్పటికే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది గానీ జాబితాపై ఏకాభిప్రాయం కుదరలేదు. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి హాజరైన ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలను కూడా తీసుకోలేకపోయారు.

ఈ మూడు సీట్లపై కాంగ్రెస్ మరోసారి కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కేసీ వేణుగోపాల్.. హైదరాబాద్‌కు వచ్చారు. నేడు గాంధీభవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సహా పార్టీకి చెందిన ఖమ్మం, కరీంనగర్ జిల్లా నాయకులతో సమావేశం కానున్నారు. ఈ మూడు స్థానాలపైనా నేడు ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఖమ్మం టికెట్‌ను మండవ వెంకటేశ్వరరావుకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+