ఆలస్యం కల్లాల్లో ధాన్యం విషం.!కొనకపోతే అనర్థమేనని టీ సర్కార్ కు కాంగ్రెస్ హెచ్చరిక.!
హైదరాబాద్ : బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలు వారి ప్రాదమిక భాధ్యతను విస్మరించారని, వ్యవసాయ శాఖ మంత్రి వరి వద్దని, పామాయిల్ వేసుకోమని రైతులకు ఆదేశాలు జారీ చేస్తాడని, అంత సుధీర్గ పంటని రైతు ఎలా పండించగలడని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. వరి సేద్యంపై ఆంక్షలు పెట్టడం సరైంది కాదని, వరి రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, ఖరీఫ్ పంట ధాన్యం గురించి మాట్లాడకుండా, రబీ గురించి సీఎం చంద్రశేఖర్ రావు మాట్లాడడం హాస్యాస్పదమని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎగుమతి చేసే అవకాశం ఉన్నా, ఎందుకు చేయట్లేదని నిలదీసారు. రోజుల కొద్ది రైతులు కల్లాలలో ఉండడంతో రైతులు తీవ్ర ఆనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేసారు. వరి తప్ప మరో పంట పండని భూమిల్ని రైతులు ఏం చేయాలని, కల్లాలలో వడ్లు మొలకలెత్తుతున్నాయని, వర్షాకాల వడ్లు కొనుగోలు చెసిన తర్వాత చంద్రశేఖర్ రావు కేంద్రంపై యుద్ధం ప్రకటించని కాంగ్రెస్ నేతలు హితవు పలికారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు గురువారం జూమ్ మీటింగ్ నిర్వహింయుకుని రైతాంగ సమస్యలపై చర్చించారు.

రైతులను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అయోమయానికి గురి చేస్తున్నాయని, వరి ధాన్యంపై రైతులకు మద్దతు ధర రావాలని ఐకేపీ సెంటర్లను తెలంగాణ ప్రభుత్వం మొదట ఏర్పాటు చేసిందని, ధాన్యం తరలించే ట్రాన్స్ పోర్ట్ టెండర్ల పక్రియ ఇంకా పూర్తి కాలేదని మండిపడ్డారు. నిల్వ సామర్థ్యం సరిపోయేంత లేదని అన్నారు. చంద్రశేఖర్ రావు ఢిల్లీ వెళ్లి ఏం సాదించారని నిలదీసారు. షరతులు లేకుండా పండిన ప్రతీ ధాన్యం గింజ కొనుగోలు చేయాలని, ఏ పంట పండించినా కొనుగోలు చేయాల్సిన భాధ్యత కేంద్రం పై ఉందని కాంగ్రెస్ చెప్పుకొస్తోంది. తము చెప్పిన పంట వేయాలని ప్రభత్వాలు రైతులను బెదిరిస్తున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ లకు వినతిపత్రాలు ఇచ్చారని, రైతులు, కాంగ్రెస్ నాయకులు కలిసి అన్ని కలెక్టరేట్ ల వద్ద నిరసన ప్రదర్శనలు చేసి కలెక్టర్ లకు ధాన్యం కొనుగోలు, పంట నష్టాలు, ధాన్యం కొలతలలో కోతలు, ధరలు తదితర అంశాలపై వినతిపత్రాలు ఇచ్చారని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీదర్ బాబు ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications