హస్తం హవా: ములుగు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

ములుగు మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 20 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 12 వార్డులను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీని సాధించింది. వీరికి తోడు మరో ఇద్దరు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు కూడా విజయం సాధించడంతో మున్సిపాలిటీపై కాంగ్రెస్ పట్టు మరింత బలపడింది. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే, బీఆర్ఎస్ 5 వార్డులకు పరిమితం కాగా.. బీజేపీ కేవలం ఒక వార్డులో మాత్రమే గెలుపొందింది. ఈ విజయంతో ములుగు పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

పుర‌పోరులో హ‌స్తం హ‌వాపై మంత్రి సీత‌క్క హ‌ర్షం
విజయం సాధించిన అనంతరం కౌన్సిలర్లు ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్కను కలిశారు. ఈ సందర్భంగా ఆమె విజేతలకు శాలువాలు కప్పి, స్వీట్లు తినిపించి ఘనంగా సన్మానించారు. ములుగు అభివృద్ధి కోసం కౌన్సిలర్లు నిరంతరం శ్రమించాలని ఆమె సూచించారు. మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ఓటర్లకు మంత్రి సీతక్క ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు అందించిన ఈ విజయం బాధ్యతను మరింత పెంచిందని ఆమె పేర్కొన్నారు.

Congress Wins Mulugu Municipality Minister Seethakka Celebrates Landmark Victory in First Polls

ఇది ప్ర‌జల ఆకాంక్ష‌ల విజ‌యం- మంత్రి సీత‌క్క‌
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఫలితాలపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపు కేవలం రాజకీయ పార్టీ విజయం కాదని, ఇది ప్రజల ఆకాంక్షల విజయమని ఆమె అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా దీనిని అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకమే ఈ విజయానికి పునాది అని ఆమె స్పష్టం చేశారు.

అవినీతి రహిత పాలనే లక్ష్యం:
పారదర్శకమైన, అవినీతి రహిత పాలన అందించడమే కాంగ్రెస్ లక్ష్యమని మంత్రి సీతక్క వెల్లడించారు. మౌలిక వసతుల కల్పన, ప్రజలకు అందుబాటులో ఉండే పరిపాలన వంటి అంశాల వల్లనే పట్టణ ప్రజలు కాంగ్రెస్ వైపు నిలిచారని ఆమె తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రివర్గ సమిష్టి కృషితోనే ఈ అఖండ విజయం సాధ్యమైందని కొనియాడారు. గెలిచిన కౌన్సిలర్లు ప్రతి వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఆమె దిశానిర్దేశం చేశారు.

అభివృద్ధి పథంలో ముందుకు:
రాబోయే రోజుల్లో పట్టణాల్లో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజలు అందించిన ఆశీర్వాదాన్ని బాధ్యతగా స్వీకరిస్తూ, ప్రతి పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని సీతక్క స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+