మరో కాంట్రాక్ట్ మ్యారేజ్ భగ్నం: ఆరుగురి అరెస్ట్

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో మరో కాంట్రాక్ట్‌ మ్యారేజ్‌ గుట్టురట్టయింది. అఫీస్‌బాబానగర్‌లో 17 ఏళ్ల బాలికతో యెమన్‌ దేశానికి చెందిన ఖనీస్‌ మహ్మద్‌ అనే వ్యక్తితో కాంట్రాక్ట్ వివాహం జరిపించారు. కాగా, తనకు బలవంతంగా వివాహం చేశారని, ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాలిక ఫిర్యాదుతో యెమన్‌ దేశస్థుడు ఖనీస్‌ మహ్మద్‌ సహా పెళ్లికి సహకరించిన మరో ఐదుగురు మ్యారేజ్‌ బ్రోకర్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిపై నిర్భయచట్టం కింద కేసు నమోదు చేశామని, కాంట్రాక్ట్ మ్యారేజ్‌లు చేస్తే బ్రోకర్లపై పీడీయాక్ట్‌ నమోదు చేస్తామని డిసిపి సత్యనారాయణ హెచ్చరించారు.

Contract marriage ruined: Six arrested

బావిలో పడి విద్యార్థి మృతి

స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన విద్యార్థి బావిలో శవమై తేలాడు. ఈ విషాద సంఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన విద్యార్థి కిషన్(22) స్నేహితులతో కలిసి కరీమాబాద్‌లో ఉన్న ఓ బావిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు.

ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్‌లో సైకో హల్‌చల్

కరీంనగర్ జిల్లాలోని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఓ సైకో హల్‌చల్ సృష్టించాడు. కమిషనర్ కార్యాలయం ముందు పార్క్ చేసిన ఓ బైక్‌ను తగలబెట్టాడు. అనంతరం కార్యాలయంలోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు ఆ సైకోను అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+