Diwali 2024: దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి.. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1..!
దేశంలో దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. చీకట్లను తొలగించి వెలుగు నింపే దీపావళి పండుగ ఎప్పుడు నిర్వహించుకోవాలనేదానిపై స్పష్టత లేదు. కొంత మంది పండితులు అక్టోబర్ 31 పండుగ జరుపుకోవాలని చెబుతున్నారు. మరికొందరు నవంబర్ 1న పండుగ జరుపుకోవాలని చెబుతున్నారు. దీంతో ప్రజలు దీపావళి ఎప్పుడు జరుపుకోవాలని ఆయోమయంలో పడిపోయారు. సాధారణంగా పండుగ ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసంలో అమావాస్య రోజు జరుపుకుంటారు.
ఆ రోజు చాలా మంది కేదారేశ్వర స్వామి నోములు నోచుకుంటారు. ఇది ఎప్పుడు జరుపుకోవాలని అయ్యగార్లను భక్తులు అడుగుతున్నారు. ప్రదోష అమావాస్య అక్టోబర్ 31 తో పాటు నవంబర్ 1న ఉందని చెబుతున్నారు. వేద క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 31 మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాలకు అమావాస్య మొదలు అవుతుంది. ఈ అమావాస్య నవంబర్ 1 సాయంత్రం 5 గంటల 14 నిమిషాలకు ముగుస్తుంది. ఆ వెంటనే పాడ్యమి మొదలవుతుంది. దీంతో అక్టోబర్ 31న పండుగ జరుపుకోవాలని పలువురు పండితులు చెబుతున్నారు.

మరో పంచాంగం అయిన ధ్రుక్ సిద్ధాంత ప్రకారం లక్ష్మీ దేవి ఉదయం మాత్రమే ఉంటుందని.. అందుకే నవంబర్ 1న దీపావళి జరుపుకోవాని చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం అక్టోబర్ 31న దీపావళి సెలవు ప్రకటించింది. దీనిపై ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులే వచ్చాయి. అప్పుడు కొంత మంది ఒక రోజు దీపావళి జరుపుకుంటే మరికొంత మంది మరుసటి రోజు పండుగ జరుపుకున్నారు. కాగా దీపావళి రోజులు టపాసులు కాల్చొద్దని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
టపాసులు కాల్చడం వల్ల వాతావరణం కాలుష్యం ఏర్పడుతుందని చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో టపాసులపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా పటాకులపై తక్షణమే నిషేధం విధించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications