విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చల్లబడ్డ హైదరాబాద్: ఆకాశం మేఘావృతం, భారీ వర్ష సూచన!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నగరం చల్లగా మారింది. ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్ముకోవడంతో భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. ఎండల అల్లాడుతున్న జనానికి గత రెండు రోజులుగా చల్లబడ్డ వాతావరణం ఉపశమనం కలిగిస్తోంది.

గురువారం తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. శనివారం కూడా హైదరాబాద్ నగరంలో వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, అటు ఏపీలోనూ పలు చోట్ల భారీ వర్షం కురిసే సూచనలున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. విజయవాడలోనూ ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడింది.

cool weather and clouds covered hyderabad city

ఇక భారీ వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో పలు చోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజక వర్గంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురుస్తోంది.

ఇదిలా ఉంటే, ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేళ వాతావరణం చల్లబడటం ఆహ్లాదాన్ని ఇస్తున్నా.. భారీ వర్షం కురిస్తే మాత్రం వేడుకలకు అంతరాయం కలిగే అవకాశం లేకపోలేదు.

English summary
Hyderabad covered with dark clouds as MET issues warning of heavy rainfall in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X