విక్రమ్ గౌడ్‌కు పోలీస్ కస్టడీ, విచారణకు సహకరించలేదు!
విక్రమ్ గౌడ్‌ను విచారించేందుకు నాంపల్లి కోర్టు పోలీసులకు అనుమతి ఇచ్చింది. విక్రమ్ గౌడ్‌ను పోలీసులు తమ కస్టడీకి తీసుకొని విచారించేందుకు కోర్టు ఓకే చెప్పింది.
హైదరాబాద్: విక్రమ్ గౌడ్‌ను విచారించేందుకు నాంపల్లి కోర్టు పోలీసులకు అనుమతి ఇచ్చింది. విక్రమ్ గౌడ్‌ను పోలీసులు తమ కస్టడీకి తీసుకొని విచారించేందుకు కోర్టు ఓకే చెప్పింది.
అతనితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురు రయీస్, నందకుమార్, అహ్మద్ ఖాన్‌లకు మూడు రోజుల కస్టడీకి కోర్టు మంగళవారం అనుమతిచ్చింది.

గత నెల 28న జూబ్లీహిల్స్‌లో ఉన్న మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ ఇంట్లో కాల్పుల ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
విచారణలో పోలీసులకు సహకరించని విక్రమ్
కాల్పుల కేసులో విక్రమ్ గౌడ్ పోలీస్ కస్టడీ బుధవారం సాయంత్రం ముగిసింది. ఆయన విచారణలో సహకరించలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications