గురుకుల పాఠశాలలో ప్రమాద ఘంటికలు.!29మంది విద్యార్తులకు కరోనా పాజిటీవ్.!బోధనా సిబ్బంది షాక్.
ఖమ్మం/హైదరాబాద్ : దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిందని వైద్య ఆరోగ్య శాఖ లెక్కలుచూపిస్తున్నప్పటికీ గ్రామీణ ప్రజలమీద కరోనావైరస్ పంజా విసురుతూనే ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్ పాఠశాల విద్యార్థుల మీద ప్రతాపం చూపినట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా వైరా గ్రామంలో గురుకుల పాఠశాల మరియు జూనియర్ కాలేజీలో కరోనా కలకలం రేపింది. వైరస్ లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన సిబ్బంది టెస్టులు నిర్వహించగా మొత్తం 29 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో బోధనా సిబ్బంది షాక్ కు గురైనట్టు తెలుస్తోంది.

గురుకుల పాఠశాలలో కరోనా విజృంభణ.. 29మంది కి కరోనా పాజిటివ్
ఇదిలా ఉండగా తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేయడంతో ఇటీవల రెసిడెన్షియల్ విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. రెసిడెన్సియల్ పాఠశాలల్లో బోధన సజావుగా సాగుతుందనుకున్న సమయంలో కరోనా పంజా విసురుతోంది. ఖమ్మం జిల్లా వైరాలో గురుకుల పాఠశాలతో పాటు జూనియర్ కాలేజీలో కరోనా పంజా విసిరింది. ఇటీవల జరిపిన టెస్టుల్లో 13 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా, ఆ సంఖ్య తాజాగా 29కి చేరింది. ఒకేసారి అంతమంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఇతర విద్యార్థినులు, గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులు, బోదనా సిబ్బందిలో ఆందోళన మొదలైంది. 8వ తరగతి చదువుతున్న 13 మంది విద్యార్థినులకు కరోన పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సర్వత్రా ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది.

యాజమాన్యం నిర్లక్ష్యం.. వసతులు సరిగా లేవన్న తల్లిదండ్రులు
ఖమ్మం జిల్లా వైరాలోని గురుకుల పాఠశాల, బాలికల జూనియర్ కాలజీలో విద్యార్థినులు కొందరికి జ్వరం వచ్చింది. కరోనా లక్షణాలు సైతం కనిపించడంతో టెస్టులు నిర్వహించారు. ఇందులో మొత్తం 29 మందికి కొవిడ్19 పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బి మాలతీ తెలిపారు. విద్యార్థినులకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పాజిటివ్‌గా తేలిన వారందర్నీ ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు. కొందర్ని వారి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లి హోమ్ క్వారంటైన్‌లో ఉంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారని వైద్య సిబ్బంది స్పష్టం చేస్తోంది.

మొత్తం 550 మంది స్టూడెంట్స్. వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు
స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నందున ఎవర్నీ ఆసుపత్రిలో చేర్పించలేదని డాక్టర్ బి మాలతీ స్పష్టం చేశారు. కానీ స్కూల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారని, పిల్లలకు కరోనా పాజిటివ్ అని తమకు సైతం ఆలస్యంగా తెలిపారని మరికొందరు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. గత నెలలో తెలంగాణ ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలకు అనుమతులు ఇచ్చాక రెసిడెన్షియల్ పాఠశాలలు తెరుచుకున్నాయి.దురదృష్ట వశాత్తూ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని వైద్య అదికారులు చెప్తున్నారు.

అప్రమత్తమైన సిబ్బంది.. విద్యార్తులకు హోం క్వారెంటైన్ లో చికిత్స
గురుకుల పాఠశాల, కాలేజీలో కరోనా కేసులు ఘటన వెలుగుచూడటంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. పాఠశాలను సందర్శించి, సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడకం లాంటి కరోనావైరస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. వైరాలోని గురుకుల పాఠశాల మరియు జూనియర్ కాలేజీలో మొత్తం 550 విద్యార్తులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో దాదాపు సగం మందికి జ్వరం, దగ్గు లాంటి కరోనా లక్షణాలు కనిపించడంతో గత రెండు రోజులుగా 225 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. సోమవారం మరి కొందరికి టెస్టులు నిర్వహించగా, అందులో 29 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. తీంతో బోధనా సిబ్బంది విస్మయానికి గురైనట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ ఒకటినుంచి తెలంగాణలో విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో అక్టోబర్ చివరి వారంలో రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలు సైతం కొవిడ్ నిబంధనలతో తెరుచుకున్నాయి. తెరుచుకున్నాక ఇలాంటి దుర్గటనలు చోటుచేసుకోవడం శోచనీయం అంటున్నారు విద్యార్ధి తల్లి దండ్రులు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications