తెలంగాణాలో కరోనా పంజా .. భారీగా పెరుగుతున్న కేసులు .. ఒక్కరోజే 169 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్న తీరు తెలంగాణ వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. ఒక శుక్రవారం రోజు తెలంగాణ రాష్ట్రంలో రికార్డ్ లెవల్లో 169 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ కేసులలో అత్యధికంగా జిహెచ్ఎంసి పరిధిలోనే నమోదయ్యాయి.

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు .. జీహెచ్ఎంసీ పరిధిలోనే 82కొత్త కేసులు
ఒక హైదరాబాద్ పరిధిలోనే 82 కేసులు నమోదయ్యాయి అంటే హైదరాబాద్ లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తుంది అన్నది అర్థమవుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసులు చూస్తే 2425 కేసులు నమోదు కాగా ఇప్పటివరకు 973 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి .1381 కేసులు కరోనా బారి నుండి బయటపడి డిశ్చార్జ్ కాగా 71 మంది మృతి చెందారు. నిన్న తాజాగా నమోదైన కేసులలో జీహెచ్ఎంసీ పరిధిలోని 82 కేసులు కాక, రంగారెడ్డి జిల్లాలో 14, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రెండు కేసుల చొప్పున నమోదయ్యాయి. అంతేకాక, విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 64 కొత్త కేసులను శుక్రవారమే గుర్తించడం గమనార్హం.

తెలంగాణలో 71కి చేరిన మరణాలు
మరో ఐదుగురు వలస కార్మికులకు కూడా కరోనా వైరస్ సోకినట్లు గా అధికారులు నిర్ధారించారు. ఇక నిన్న ఒక్కరోజే మరో నలుగురు కరోనాతో చనిపోయినట్లుగా వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 71కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల ని చూస్తే 1,73,491 మంది ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డారు . మహారాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఏ మాత్రం తగ్గటం లేదు. దేశంలోనే అత్యధికంగా ఈ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది.
Recommended Video

దేశంలో ఆందోళనకరంగా మహారాష్ట్ర కేసులు .. లాక్ డౌన్ వైపే రాష్ట్రాల మొగ్గు
నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో 2682 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో మొత్తం మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 62,228కి చేరింది. ఇది మహారాష్ట్ర ప్రజల్ని మాత్రమే కాకుండా భారత దేశాన్ని కూడా తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న అంశం. ఏది ఏమైనా ప్రస్తుతం లాక్డౌన్ 4.0 కొనసాగుతున్న వేళ ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా మారింది. ఇక దీంతో లాక్ డౌన్ ను మరింత పొడిగించాలని కేంద్ర ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక అన్ని రాష్ట్రాలు కూడా కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తున్న తరుణంలో లాక్ డౌన్ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications