వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాలో కరోనా పంజా .. కరీంనగర్ లో చావుకు వెళ్లిన ౩౩ మందికి, పెద్దపల్లి జిల్లాల్లో ఒకేసారి 10 కేసులు

|
Google Oneindia TeluguNews

తగ్గినట్టే తగ్గి తెలంగాణా రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నాలుగైదు రోజుల క్రితం వంద లోపే నమోదైన కరోనా కేసులు ఇప్పుడు ఎక్కువగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 165 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. గడచిన 24 గంటల్లో 149 కేసులు కరోనా నుండి బయటపడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజు కరోనా కారణంగా ఒక మరణం సంభవించిందని వైద్య ఆరోగ్యశాఖ డేటా చెపుతోంది.

ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు .. గత 24 గంటల్లో 13,993 కొత్త కేసులు ,101 మరణాలుఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు .. గత 24 గంటల్లో 13,993 కొత్త కేసులు ,101 మరణాలు

 తెలంగాణాలో కలకలంగా మారిన కరోనా

తెలంగాణాలో కలకలంగా మారిన కరోనా

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 1715 యాక్టివ్ కేసులు ఉండగా దేశంలో రికవరీ రేటు 98.87 శాతం గా ఉంది.

కరోనా కేసులు తగ్గుతున్నాయని కాస్త ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే మరోమారు కరోనా వైరస్ మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలను కలవరానికి గురి చేస్తోంది. తాజాగా పెద్దపెల్లి జిల్లాలోని బసంత్ నగర్ లో దాదాపు 10 మంది కరోనా బారిన పడడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

 పెద్దపల్లి బసంత్ నగర్ టోల్ గేటు వద్ద పని చేసే సిబ్బందికి కరోనా

పెద్దపల్లి బసంత్ నగర్ టోల్ గేటు వద్ద పని చేసే సిబ్బందికి కరోనా

బసంత నగర్ టోల్ గేట్ లో పనిచేస్తున్న సిబ్బందిలో కొందరు కరోనా బారిన పడ్డారు. అయితే వీరి నుండి మరికొంత మందికి కూడా కరోనా వ్యాపించినట్లు గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బసంత్ నగర్ లో పెద్దఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగిస్తున్నారు వైద్యులు.

ఇదిలా ఉంటే కరీంనగర్ జిల్లాలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన 33 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తిలో పది రోజుల క్రితం ఓ వ్యక్తి అనారోగ్యంతో మరణించారు. ఆయన అంత్యక్రియలకు, కర్మకాండకు చేగుర్తి , దుర్శేడ్, మొగ్ధుం పూరు వాసులు భారీగా హాజరయ్యారు.

కరీంనగర్ జిల్లా చేగుర్తిలో చావుకు హాజరైన వారికి ౩౩ మందికి కరోనా

కరీంనగర్ జిల్లా చేగుర్తిలో చావుకు హాజరైన వారికి ౩౩ మందికి కరోనా

అయితే వీరిలో కొందరికి కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. గురు, శుక్రవారాలలో 33 మందికి వైరస్ నిర్ధారణ అయినట్లుగా అధికారులు చెబుతున్నారు. వీరిలో 32 మంది చేగుర్తి వాసులు కాగా ఒకరు దుర్శేడ్ గ్రామస్తుడు అని తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, అప్రమత్తమై గ్రామంలో కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నారు.


ఇక కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి జిల్లా వాసులు తాజాగా నమోదైన కరోనా కేసుల దెబ్బకు భయపడుతున్నారు.

English summary
Corona is booming in Telangana state. 10People in Basant Nagar in Peddapalli district have been affected by corona. Meanwhile, in Karinagar district, 33 people were diagnosed with coronavirus after attending a death of a man in Chegurti.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X