వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పింఛన్ ఇచ్చే వ్యక్తి ద్వారా 54 మందికి కరోనా ... ఉలిక్కిపడ్డ గ్రామం

|
Google Oneindia TeluguNews

ప్రపంచంపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. పల్లెలు పట్టణాలు నగరాలు అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ కరోనా వ్యాప్తి జరుగుతుంది. లాక్ డౌన్ సడలింపులతో వైరస్ విస్తృతి మరింత పెరిగినట్లుగా తెలుస్తోంది. ఒక వీరు, వారు అన్న తేడా లేకుండా, ఎప్పుడూ ఎవరికి ఎలా వస్తుందో అర్థం కాకుండా కరోనా వైరస్ ప్రజలతో సహజీవనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.

ఇక తాజాగా జరిగిన ఒక సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో ఓ గ్రామ ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది. వనపర్తి జిల్లాలో చిన్నంబావి మండలం పెద్ద దగడ గ్రామంలో పింఛన్లు అందజేసే వ్యక్తి తన విధి నిర్వహణలో భాగంగా అక్కడ ఉన్న వృద్ధులకు, వికలాంగులకు వితంతువులకు పింఛన్లు అందజేశాడు. గ్రామస్తులకు పింఛన్ అందించిన అతనిలో ఎలాంటి లక్షణాలు లేవు . గ్రామంలోని ఓ ఇంటి వద్ద అతను పింఛన్లను పంపిణీ చేశాడు.

Corona to 54 people by a person who distributes pensions ..villagers shock

పించన్ లు పంపిణీ చేసిన వ్యక్తి కుటుంబంలో ఒకరికి అనారోగ్యం కలగటంతో పరీక్షలు నిర్వహించారు .అతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కుటుంబం అంతటికీ పరీక్షలు నిర్వహించారు . ఆ పరీక్షల్లో కుటుంబంలోని 9 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్ గా పించన్ ఇచ్చిన వ్యక్తిని గుర్తించారు . దీంతో అతని ప్రైమరీ కాంటాక్ట్ లకు పరీక్షలు నిర్వహించారు.
పింఛన్ తీసుకున్న వారిలో కొందరు అస్వస్థతకు గురయ్యారు. దీంతో గ్రామంలోని 250 మందికి రాపిడ్ యాంటిజెన్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించారు.

Recommended Video

Suriya 5 కోట్ల విరాళం..'ఆకాశమే నీ హద్దురా' రిలీజ్ డేట్ ఫిక్స్ | Soorarai Pottru || Oneindia Telugu

అప్రమత్తమైన వైద్య శాఖ అధికారులు నిర్వహించిన పరీక్షలలో ఏకంగా గ్రామంలో 54 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. దీంతో పాజిటివ్‌ వచ్చిన వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారుల వెల్లడించారు. పింఛన్ అందించిన వ్యక్తి ద్వారా అని వీరందరికీ కరోనా వైరస్ సోకినట్లుగా భావిస్తున్నారు. వారందరినీ హోం క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు . ఓకే గ్రామంలో ఇంతమందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కరోనా నిర్ధారణ కాని వారు సైతం, ఎప్పుడు తమకు కరోనా వస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు.

English summary
Corona positive was diagnosed in 54 people in a single village by a person who distributes pensions. The incident took place in Vanaparthi district of Telangana state. Villagers say the corona was spread by a pensioner in the Chinnambavi zone pedda dagada village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X