వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

no bonalu:బోనాలకు ఈసారి బ్రేక్, పూజారులే సమర్పిస్తారు, భక్తులకు నో ఎంట్రీ: మంత్రి అల్లోల

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మరి వల్ల స్కూళ్లు, కాలేజీలు క్లోజ్.. ఆలయాలు, ప్రార్థన మందిరాలు సోమవారం నుంచి తెరుచుకుంటోన్న.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం స్పష్టంచేసింది. అయితే ప్రతీసారి నిర్వహించే బోనాల పండగ ఈ సారి నిర్వహించడం లేదు అని ప్రభుత్వం వెల్లడించింది. అమ్మవార్లకు పూజారులే బోనాలు సమర్పిస్తారని దేవదాయశాఖ మంత్రి అల్లలో ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో కరోనా వైరస్ కేసులు పెరగడం ఒక కారణమైతే.. భౌతికదూరం పాటించడం ముఖ్యమని తేల్చిచెప్పారు.

కరోనా లాక్ డౌన్ ఎలా ఫెయిలైందంటే.. సాక్ష్యం చూపిన రాహుల్.. తప్పంతా నెహ్రూదేనన్న బీజేపీ..కరోనా లాక్ డౌన్ ఎలా ఫెయిలైందంటే.. సాక్ష్యం చూపిన రాహుల్.. తప్పంతా నెహ్రూదేనన్న బీజేపీ..

బోనాలకు బ్రేక్

బోనాలకు బ్రేక్

హైదరాబాద్, సికింద్రాబాద్‌లో బోనాల పండుగ వైభవంగా జరుగుతాయి. గోల్కొండ బోనాల నుంచి మొదలై మహంకాళితో ముగుస్తాయి. బోనాలతో భాగ్యనగరంలో ఉత్సవ శోభ కనిపిస్తూ ఉంటుంది. కానీ కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో బోనాల పండగ నిర్వహించడం లేదని దేవదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈ నెల 25వ తేదీన గోల్కొండ బోనాలు ప్రారంభం కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. కానీ కరోనా వల్ల పూజారులే అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని తెలిపారు.

ఫిజికల్ డిస్టన్స్

ఫిజికల్ డిస్టన్స్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం సోమవారం నుంచి ఆలయాల్లో దర్శనాలకు అనుమతిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. క్యూ లైన్లలో భౌతికదూరం విధిగా పాటించాలని.. సోడియం హైపోక్లోరైడ్‌తో ఆలయ ఆవరణ శుద్ది చేయాలని పేర్కొన్నారు. గుడికి లోపలికి ప్రవేశించే మార్గంలోనే శానిటైజర్ అందుబాటులో ఉంచాలని.. థర్మల్ స్కీనింగ్ ఏర్పాటు చేయాలని స్పష్టంచేశారు. అయితే కంటైన్మెంట్ జోన్లలో మాత్రం ఆలయాలు ఓపెన్ చేయరని చెప్పారు.

Recommended Video

List of Train Services, Routes, New Rules : All You Need To Know
వృద్దులు, పిల్లలు రావొద్దు

వృద్దులు, పిల్లలు రావొద్దు

65 ఏళ్లు పైబడిన వారు, 10 ఏళ్ల లోపు చిన్నారులను ఆలయానికి రావొద్దని కోరారు. ఆలయాల్లో గల కోనేరులో స్నానం చేసేందుకు అనుమతించబోమని చెప్పారు. ఆలయాల వద్ద గల షాపుల నుంచి ప్రసాదాలు మాత్రం కొనుగోలు చేయొచ్చని తెలిపారు. అంతరాలయ దర్శనం, శఠగోపం, తీర్థప్రసాదం, వసతి సౌకర్యాలు ఉండవని క్లారిటీ ఇచ్చారు. ఆన్ లైన్ బుకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని.. కరోనా లక్షణాలు ఉన్నవారు మాత్రం ఆలయాలకు రావొద్దని మంత్రి అల్లోల సూచించారు.

English summary
no bonalu: not celebrate bonalu festival this year minister indrakaran reddy said in statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X