కరోనా వైరస్: నిర్మల్‌లో హై అలర్ట్, ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన 50 మంది, క్వారంటైన్‌కు కొందరు..
ఢిల్లీ మర్కజ్‌లో జరిగిన మత ప్రార్థనలు తెలుగురాష్ట్రాల్లో హైటెన్షన్ నెలకొంది. 800 మంది హాజరయ్యారనే విషయం తెలిసి.. వారిని కనిపెట్టడంలో అధికారులు, పోలీసులు నిమగ్నమయ్యారు. వారి పరిస్థితి ఎలా ఉంది, వారు ఎవరితో సమావేశమయ్యారనే అంశంపై కలవరానికి గురిచేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గల నిర్మల్‌కు చెందిన 50 మంది ఢిల్లీ వెళ్లినట్టు తేలడంతో అధికారుల గుండె గుబేల్ మంది.

నిర్మల్ నుంచి 50 మంది
నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కాజ్‌లో మత పరమైన ప్రార్థనలకు నిర్మల్ నుంచి 50 మంది వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. ప్రార్థనలకు ఇండోనేషియా తదితర దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో చనిపోయిన ఆరుగురికి కరోనా వైరస్ సోకిందని అధికారులు నిర్ధారించారు. దీంతో తెలంగాణ, ఏపీ నుంచి వెళ్లిన 800 మంది ఆరోగ్య పరిస్థితిపై అధికారులు దృష్టిసారించారు. అయితే నిర్మల్ నుంచి 50 మంది వరకు వెళ్లడంతో.. అక్కడ హై అలర్ట్ విధించారు.

పరారీలో మరికొందరు
ఇప్పటికే నిర్మల్‌లో కొందరినీ అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వారిని క్వారంటైన్‌కు తరలించారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారు లొంగిపోవాలని, తాము గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. క్వారంటైన్ తరలించిన వారిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ నుంచి ఎప్పుడు వచ్చారు. ఎవరెవరిని కలిశారు అని అడిగి వివరాలు సేకరిస్తున్నారు. వారు చెప్పిన అంశాల ఆధారంగా.. ఢిల్లీ వెళ్లొచ్చిన వారు కలిసిన జనాన్ని కూడా క్వారంటైన్ తరలిస్తారు.

ఇలా వెలుగులోకి..
నాంపల్లికి చెందిన వృద్దుడి మరణంతో విషయం వెలుగులోకి వచ్చింది. మార్చి 14వ తేదీన అతను జమాత్ కోసం ఢిల్లీ వెళ్లాడు. అక్కడే మూడురోజుల పాటు ఉండి.. 17వ తేదీన హైదరాబాద్ వచ్చాడు. ఇంటికి తిరిగొచ్చాక జ్వరం, శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందించారు. తర్వాత వైద్యులకు అనుమానం వచ్చి.. కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. వెంటనే అతని కుటుంబసభ్యులను కూడా క్వారంటైన్‌లో ఉంచారు. సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్లొచ్చి మృతిచెందిన ఆరుగురి వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. జమాత్‌కు తెలుగురాష్ట్రాల నుంచి 800 మంది వెళ్లినట్టు తేలడంతో ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications