మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా పాజిటివ్: వారంతా కూడా టెస్టులు చేసుకోవాలని సూచన

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రలో మరో మంత్రి కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. వారిలో కొందరు ప్రాణాలు వదలగా.. చాలా మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.

తాజాగా, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. గత రెండు రోజుల నుంచి జలుబు, జ్వరంతో బాధపడుతున్న మంత్రికి.. తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు మంత్రి గంగుల కమలాకర్‌. ఈ మధ్య తనను కలిసినవారు, సన్నిహితంగా మెలిగిన ప్రతి ఒక్కరూ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

 Coronavirus positive for telangana minister gangula kamalakar.

తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 44,310 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 196 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది.

తాజాగా, నమోదైన 196 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,68,266కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా ఒకరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3933గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1543 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 201 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,60,143కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4190 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.78 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 00, భద్రాద్రి కొత్తగూడెంలో 06, జీహెచ్ఎంసీలో 59. జగిత్యాలలో 06, జనగామలో 04, జయశంకర్ భూపాలపల్లిలో 01, జోగులాంబ గద్వాలలో 00, కామారెడ్డిలో 02, కరీంనగర్‌లో 16, ఖమ్మంలో 07, కొమురంభీం ఆసిఫాబాద్ లో 01, మహబూబ్‌నగర్‌లో 02, మహబూబాబాద్‌లో 01, మంచిర్యాలలో 08, మెదక్‌లో 00, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 09, ములుగులో 00, నాగర్ కర్నూలులో 01, నల్గొండలో 13, నారాయణపేటలో 00, నిర్మల్‌లో 00, నిజామాబాద్‌లో 03, పెద్దపల్లిలో 04, రాజన్న సిరిసిల్లలో 03, రంగారెడ్డిలో 15, సంగారెడ్డిలో 03, సిద్దిపేటలో 06, సూర్యాపేటలో 06, వికారాబాద్ లో 00, వనపర్తిలో 01, వరంగల్ రూరల్‌లో 03, వరంగల్ అర్బన్‌లో 15, యాదాద్రి భువనగిరిలో 04 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, మెదక్, ములుగు, నారాయణ్ పేట, నిర్మల్, వికారాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

Recommended Video

    India Coal Crisis : Unallocated Power వాడుకోమన్న కేంద్ర ప్రభుత్వం, అయినా Blackout || Oneindia Telugu

    మరోవైపు దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,313 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 181 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉపశమనం కలిగించే విషయం ఎంటంటే.. దాదాపు ఆరు నెలల తర్వాత రోజువారిగా నమోదయ్యే కేసుల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. కాగా.. కేరళలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న నిమోదైన కరోనా కేసులు, మరణాల్లో కేరళలో 6,996 కేసులు నమోదు కాగా.. 84 మంది మరణించారు. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,39,85,920 కి పెరిగింది. దీంతోపాటు మరణాల సంఖ్య 4,50,963కి చేరింది. అయితే.. సోమవారం కరోనా నుంచి 26,579 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,33,20,057కి చేరిందని కేంద్రం వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 2,14,900 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏడు నెలల తర్వాత యాక్టివ్ కేసులు ఈ స్థాయిలో తగ్గడం గమనార్హం. మరోవైపు, దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 95,89,78,049 కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న దేశవ్యాప్తంగా 65,86,092 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+