టీఆర్ఎస్‌లో కరోనా కలవరం.. నిన్న ఎర్రబెల్లికి.. నేడు ఎంపీ రంజిత్ రెడ్డికి పాజిటివ్.. మిగతా నేతల పరిస్థితి..

ప్రపంచ వ్యాప్తంగా ఒకవైపు కరోనా, మరో వైపు ఒమిక్రాన్ విజృంభిస్తోంది. భారత్‌లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కరోనా మహమ్మారి కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.. ఒమిక్రాన్ బాధితుల సంఖ్య కూడా పెరిగింది. కాగా తెలంగాణలోని టీఆర్ఎస్ నేతల్లో కరోనా కలకలం రేపుతోంది. ఆపార్టీ నేతలు కరోనా బారిన పడ్డారు. దీంతో గులాబీ నేతలు క‌రోనా టెస్టుల‌కు క్యూ క‌డుతున్నారు.

ఎంపీ రంజిత్ రెడ్డికి క‌రోనా పాజిటివ్

ఎంపీ రంజిత్ రెడ్డికి క‌రోనా పాజిటివ్

టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన ఐసోలేషనలోకి వెళ్లి వైద్యం తీసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వాళ్లంతా కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలని సూచించారు. ప్రజల తన వద్దకు రావద్దని కోరారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. సొమవారం వరకు జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మంత్రుల బృందంతో కలిసి ఢిల్లీలో పర్యటించారు. కరోనా లక్ష‌ణాలు కన్పించడంతో యాంటీజెన్ రాపిడ్ టెస్ట్‌లు చేయించుకున్నారు. పరీక్ష‌ల్లో పాటిజివ్‌గా తేలింది. దీంతో రంజిత్ రెడ్డి హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

ఎర్ర‌బెల్లికి పాజిటివ్

ఎర్ర‌బెల్లికి పాజిటివ్

మరో వైపు నిన్న ( శనివారం) పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కరోనా పడ్డారు. హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం మంత్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. రైతుల సమస్యలపై వారం రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన ఎర్రబెల్లి హైదరాబాద్ చేరుకున్నారు. కరోనా లక్ష‌ణాలు కనిపించడంతో యాంటీజెన్ రాపిడ్ టెస్ట్ చేయించుకున్నారు.

పరీక్ష‌ల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. గత వారం రోజులుగా తనను కలిసి వారు కరోనా పరీక్ష‌లు చేయించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. తన ఐసోలేషన్ పూర్తయ్యే వరకు ప్రజలు తన వద్దకు రావద్దు అని కోరారు.

టీఆర్ఎస్ నేత్లో క‌రోనా భ‌యం..

టీఆర్ఎస్ నేత్లో క‌రోనా భ‌యం..

వరుసగా టీఆర్ఎస్‌లోని ఇద్ద‌రు ముఖ్య‌నేత‌లు కరోనా బారిన పడడంతో ఆపార్టీ నేతల్లో కలవరం నెలకొంది. ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లింది. ఈ మంత్రుల బృందంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, జగదీశ్వర్ రెడ్డి , పువ్వాడ అజయ్ కుమార్ , వేముల ప్రశాంత్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు కేకే, నామా, రంజిత్ రెడ్డితో పాటు ఇతర ఎంపీలు, పార్టీ నేతలు కూడా ఉన్నారు.

రైతులు పండించిన వరిధాన్యం కొనుగోలుపై కేంద్రం మంత్రి పియూష్ గోయల్ ను కూడా కలిశారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం రాతపూర్వకంగా ఇవ్వాల్సిందేన‌ని వారం రోజులు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఈ బృందంలోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు, ఎంపీ రంజిత్ రెడ్డికి కరోనా సోకడంతో మిగతా నేతల్లో కంగారు మొదలైంది. కరోనా పరీక్ష‌ల‌కు క్యూ క‌ట్టారు.

ఒక‌వైపు క‌రోనా, మ‌రో వైపు ఒమిక్రాన్ కేసులు

ఒక‌వైపు క‌రోనా, మ‌రో వైపు ఒమిక్రాన్ కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. నిన్న 7,189 కొత్త కరోనా కేసులు వచ్చాయి. ఒక్క రోజులోనే 387 మంది మరణించారు. కరోన బారి నుంచి 7,286 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 77,032 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు సంఖ్య 422కు చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+