వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్స్ లో కార్పోరేట్ వైద్య సేవలు.!సెలబ్రిటీలు వ్యాక్సీన్ పట్ల ప్రచారం చేయాలన్న మంత్రి హరీష్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : వైద్య ఆరోగ్య శాఖా మంత్రి మంత్రి హరీశ్ రావు పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఎండోస్కోపీక్ ఎక్విప్మెంట్, ఎం అర్ యు ల్యాబ్, స్టెమ్ సెల్ రీసెర్చ్ ఫెసిలిటీ, ఫిజియోథెరపీ విభాగం, బోన్ డెన్సిటోమీటర్, శాంపిల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం, వాటర్ ఏటిఎం లను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా హరీష్ మాట్లాడారు.12 కోట్లతో వివిధ మెడికల్ ఎక్విప్మెంట్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, అందులో ముఖ్యంగా మెడికల్ జెనటిక్ ల్యాబరెటరీ అందుబాటులోకి వచ్చిందని స్పష్టం చేసారు. వారసత్వంగా వచ్చే జన్యు లోపాలను అరికట్టే అత్యాధునిక లాబ్ ను రాష్ట్ర ప్రజలకు అందుబాటులో తేవడం జరిగిందని మంత్రి తెలిపారు.

 నిమ్స్ ను సందర్శించిన మంత్రి హరీశ్ రావు.. 12 కోట్లతో అత్యాధునిక ఎక్విప్మెంట్స్ ప్రారంభం

నిమ్స్ ను సందర్శించిన మంత్రి హరీశ్ రావు.. 12 కోట్లతో అత్యాధునిక ఎక్విప్మెంట్స్ ప్రారంభం

మల్టీ డిసిప్లనరీ రిసెర్చ్ యూనిట్ నిమ్స్ లో అందుబాటులోకి తెచ్చామని, బోన్ డెన్సిటీవ్ మీటర్ ను కూడా అందుబాటులోకి తెచ్చామని, బోన్స్ డెన్స్ ఎంత ఉంది అని టెస్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని, బోన్స్ ఎంత స్ట్రెంత్ ఉన్నది తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని, ఇది రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఎక్కడా లేదని, తొలి సారిగా రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేసారు. న్యుమాటిక్ వ్యూ సిస్టమ్ అందుబాటులోకి తేవడమే కాకుండా టెస్టింగ్ శాంపిల్స్ ను అందులో పెడితే అది ల్యాబ్ లోకి వెళుతుందని. తిరిగి ఆ ఫలితాలు రిటర్న్ తెస్తుందని హరీష్ తెలిపారు.

 నిమ్స్ లో బెడ్లకు కొరత లేదు.. అదనపు ఏర్పాట్లు చేసామన్న హరీష్

నిమ్స్ లో బెడ్లకు కొరత లేదు.. అదనపు ఏర్పాట్లు చేసామన్న హరీష్

అంతే కాకుండా రెండున్నర కోట్లతో దీన్ని అందుబాటులోకి తెచ్చామని, నిమ్స్ లో గతంలో బెడ్ దొరకడం కష్టంగా ఉండేదని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిమ్స్ ను బలోపేతం చేయాలని స్పష్టం చేయడంతో మరో 200 పడకల ఐసీయూ బెడ్స్ ను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ 200 బెడ్స్ జనవరి 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, ఇవి పూర్తయితే పేద ప్రజలకు నిమ్స్ లో 350 ఐసీయూ బెడ్స్ అందుబాటులోకి వస్తాయని హరీష్ తెలిపారు.

 తెలంగాణకు ఒమిక్రాన్ రాలేదు.. ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామన్న మంత్రి హరీష్ రావు

తెలంగాణకు ఒమిక్రాన్ రాలేదు.. ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామన్న మంత్రి హరీష్ రావు

గతంలో వెంటిలేటర్ దొరకాలంటే కష్టంగా ఉండేదని, పేదవాళ్లు వెంటిలేటర్ పై ఉండాలంటే లక్షల రూపాయలు ఖర్చు అయ్యేదని, ఈ వెంటలేటర్ 89 మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు 120 వెంటిలేటర్లు కొత్తవి అందుబాటులోకి తెస్తున్నామని హరీష్ రావు అన్నారు. వచ్చే 45 రోజుల్లో వెంటిలెటర్లు, ఐసీయూ బెడ్స్ అందుబాటులోకి తెవాలని ఆదేశించడం జరిగిందని, హెచ్ వోడీలతో మాట్లాడితే కార్పోరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం ప్రభుత్వ రంగంలో అందించాలంటే కొంత ఎక్విప్మెంట్ ఆవశ్యకత అవసరమని డాక్టర్లు ప్రతిపాదించినట్టు, రెడియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమస్ట్రీ, నెఫ్రాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, న్యూరో సర్జరీ డిపార్టమెంట్ల నుండి రిక్వేస్ట్ వచ్చాయని, ఇందుకోసం 153 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగిందని మంత్రి తెలిపారు.

 సెలబ్రిటీలు ముందుకు రావాలి.. సోషల్ మీడియా వేదికగా వ్యాక్సీన్ పట్ల ప్రచారం చేయాలన్న మంత్రి

సెలబ్రిటీలు ముందుకు రావాలి.. సోషల్ మీడియా వేదికగా వ్యాక్సీన్ పట్ల ప్రచారం చేయాలన్న మంత్రి

అంతే కాకుండా జీహెచ్ఎంసీ అధికారులతో సంప్రదించి ఐదు రూపాయల బోజనం ఇక్కడ రోగుల సహాయకులకు పెట్టాలని నిర్ణయించామని, త్వరలోనే 5 రూపాయలకే భోజనం పెట్టిస్తామని మంత్రి తెలిపారు. ఒమిక్రాన్ కేసులు తెలంగాణలో రాలేదని, అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, ప్రతి ఒక్కరూ కో నిబంధనలు పాటించాలని మంత్రి హరీష్ రావు స్పష్టం చేసారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా వాక్సిన్ ప్రచారం నిర్వహించాలని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాలతో ప్రతి రోజు లక్ష దాకా కోవిడ్ నిర్దారణ పరీక్షలు చేయాలని నిర్ణయించామని మంత్రి హరీష్ రావు తెలిపారు.

English summary
Health Minister Harish Rao visited NIMS Hospital in Panjagutta. He inaugurated the Endoscopic Equipment, MRU Lab, Stem Cell Research Facility, Department of Physiotherapy, Bone Densitometer, Sample Transport System and Water ATM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X