Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అవినీతిని బీజేపి వ్యవస్థీకృతం చేసింది.!కమలం నేతలపై గులాబీ నేతలు ఫైర్.!

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం విజయవంతం కావడంతో బీజేపి జీర్ణించుకోలేకపోతోందని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ప్లీనరీలో టీఆర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టిన తీర్మాణాలతో కమలం నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ప్రభుత్వ విప్ బాల్క సుమన్, గువ్వల బాల రాజు, ఎమ్మెల్యే కేపీ వివేక్ మండి పడ్డారు. కమలం పార్టీ కాదు కార్పొరేట్ పార్టీ అని తాము చేస్తున్న ఆరోపణలపై బీజేపీ నేతలకు జవాబిచ్చే దమ్ముందా అని సవాల్ విసిరారు. బీజేపీ డబుల్ ఇంజిన్ కు ప్రజలు ఎర్ర జెండా చూపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని గులాబీ నేతలు స్పష్టం చేసారు.

 బీజేపిలో అవినీతి నేతలు లేరా.?కుటుంబ పాలనపై బీజేపీ మాట్లాడటం హాస్యాస్పదమన్న బాల్క సుమన్

బీజేపిలో అవినీతి నేతలు లేరా.?కుటుంబ పాలనపై బీజేపీ మాట్లాడటం హాస్యాస్పదమన్న బాల్క సుమన్

భారత దేశాన్ని మతపరమైన ఎజెండా తో బీజేపీ విభజించాలనే ప్రయత్నాన్ని ప్లీనరీలో ఎండ గట్టామని విప్ బాల్క సుమన్ తెలిపారు. బీజేపీ ఎజెండా ను తిప్పికొట్టినందుకే టీఆర్ఎస్ పార్టీ మీద ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. కుటుంబ పాలన పై బీజేపీ నేతలు మాట్లాడటం వింతగా ఉందని, బీజేపీ నేతల కుటుంబ సభ్యులు రాజకీయాల్లో లేరా? అని బాల్క సుమన్ సూటిగా ప్రశ్నించారు. అవినీతి గురించి బీజేపీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, అవినీతిని వ్యవస్థీకృతం చేసిన ఘనులు ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా లే నని సుమన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

 నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎందుకు పెరుగాయి.?మోదీ ఇస్తానన్న యేటా కోటి ఉద్యోగాలు ఏమయ్యాయి.?

నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎందుకు పెరుగాయి.?మోదీ ఇస్తానన్న యేటా కోటి ఉద్యోగాలు ఏమయ్యాయి.?

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆస్తుల గురించి ప్రశ్నిస్తున్న బీజేపి ముందు అదానీకి, మోడీ పీఎం కాక ముందు ఆస్తులెన్ని?ఇపుడున్న ఆస్తులెన్ని? వివరణ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. కర్ణాటకలో బీజేపీ మంత్రిని అవినీతి ఆరోపణలతో తీసేయలేదా?అని నిలదీసారు. టీఆర్ఎస్ మీద దాడి చేయడమంటే తెలంగాణ మీద దాడి చేయడమేనని, తెలంగాణ కోసమే టీఆర్ఎస్ బతుకుతోంది, పనిచేస్తోందని బాల్క సుమన్ స్పష్టం చేసారు. దేశం లో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయో బీజేపి చెప్పాలని, ప్రధాని మోడీ చెప్పిన ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని గులాబీ నేతలు ప్రశ్నించారు.

 దళితులపై బీజేపి దాడులు సహించం.. ప్రతి దాడులకు బాద్యత తమది కాదన్న బాల్క సుమన్

దళితులపై బీజేపి దాడులు సహించం.. ప్రతి దాడులకు బాద్యత తమది కాదన్న బాల్క సుమన్

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత రాష్ట్రాల్లో దాడులు ఎక్కువయ్యాయని టీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేసారు. యూపీలో తమకు ఓట్లేయనందుకు దళితులపై బీజేపీ గుండాలు లైసెన్స్ తుపాకులతో దాడులకు దిగుతున్నారని చెప్పుకొచ్చారు. దళితుల మీద బీజేపీ నేతలు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సుమన్ హెచ్చరించారు. తమ పట్ల అనుచిత విమర్శలు చేసే వారిపై ఎవరైనా దాడి చేస్తే తమకు సంబంధం లేదని, జరిగే పరిణామాలకు నీచమైన విమర్శలు చేసిన వారే భాద్యత వహించాలని సుమన్ తెలిపారు. ప్లీనరీలో చెప్పిన ప్రతీ మాటకు కట్టుబడి ఉన్నామని, చివరి రక్తపు బొట్టు వరకు బీజేపీతో పోరాడుతామని సుమన్ మరోసారి స్పష్టం చేసారు.

 తెలంగాణను బీజేపీ విషపు కౌగిలిలోకి వెళ్ళనివ్వం.. తేల్చి చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

తెలంగాణను బీజేపీ విషపు కౌగిలిలోకి వెళ్ళనివ్వం.. తేల్చి చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ఇదిలా ఉండగా తెలంగాణ బీజేపి అద్యక్షుడు బండి సంజయ్ ది ప్రజా సంగ్రామ యాత్ర కాదు పాతాళం లోకి వెళ్లే యాత్ర అని సుమన్ ఎద్దేవా చేసారు. ప్రాజెక్టులు ఆపాలని కోర్టులకు వెళుతున్న బీజేపీ నేతలకు తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్టా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును చులకన చేస్తే తెలంగాణ ను చులకన చేసినట్టేనని అన్నారు. టీఆర్ఎస్ పార్టీని మధ్యలో వీడిన వాళ్లే చంద్రశేఖర్ రావును ఎక్కువగా విమర్శిస్తున్నారని, నిజమైన తెలంగాణ వాదులు టీఆర్ఎస్, చంద్రశేఖర్ రావు తోనే ఉన్నారని సుమన్ స్పష్టం చేసారు. తెలంగాణను బీజేపీ విషపు కౌగిలిలోకి వెళ్ళనివ్వమని, గుజరాత్ కు బానిస కానివ్వమని, అవసరం అనుకుంటే తెలంగాణ కోసం సమిద లయ్యేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు గులాబీ నేతలు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+