వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నకిలీ పత్తి విత్తనాల దందా .. ముఠా గుట్టు రట్టు చేసిన ఎస్ఓటీ పోలీసులు

|
Google Oneindia TeluguNews

పాలు కల్తీ ,నీళ్ళు కల్తీ ,నూనె కల్తీ, పప్పులు , ఉప్పులు అన్నీ కల్తీ ... కల్తీల ప్రపంచంలో ఏది అసలో ఏది నకిలీనో తెలుసుకోవటం చాలా కష్టంగా మారింది . కల్తీ చేయడానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా పరిస్థితి తయారైంది.ఇక నకిలీ పత్తి విత్తనాలతో రైతులను మోసం చేసే ఒక గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు ఎస్ఓటీ పోలీసులు . బ్రాండ్ పేర్లతో ప్యాకింగ్ చేసి నకిలీలను విక్రయించే ముఠాను పట్టుకున్నారు.

 ఏపీలో భూముల రీ సర్వే ..మనుషులకు ఆధార్ లా భూములకు భూధార్ !! ఏపీలో భూముల రీ సర్వే ..మనుషులకు ఆధార్ లా భూములకు భూధార్ !!

అమాయక రైతులను మోసం చేసే నకిలీ విత్తనాల ముఠాను పట్టుకున్న ఎస్ఓటీ పోలీసులు

అమాయక రైతులను మోసం చేసే నకిలీ విత్తనాల ముఠాను పట్టుకున్న ఎస్ఓటీ పోలీసులు

రైతుల వ్యవసాయ అవసరాలను ఆసరాగా చేసుకుని పంట పండించే విత్తనాలను కూడా కల్తీ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.వ్యవసాయ శాఖాధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవటం, ఇక సీజన్ లో రైతుల అవసరాలు ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు హైదరాబాద్ కేంద్రంగా నకిలీ పత్తి విత్తనాలు పలు కంపెనీల పేరుతో ప్యాకింగ్ చేస్తున్నారు. ఇక అగ్రికల్చర్ అధికారుల కాసుల కకుర్తితో ఇలాంటి వారి దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా వెలిగింది. ఈ కల్తీ దందాపై సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్ నగరంలో కల్తీ విత్తనాల దందా బట్టబయలు చేశారు.

హయత్ నగర్ లో బ్రాండెడ్ ప్యాకింగ్ తో నకిలీ విత్తనాల దందా

హయత్ నగర్ లో బ్రాండెడ్ ప్యాకింగ్ తో నకిలీ విత్తనాల దందా


రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు రంగంలోకి దిగి అమాయక ప్రజల అవసరాన్ని ఆసారగా చేసుకుని పత్తివిత్తనాలు కల్తీ చేస్తూ, వివిధ బ్రాండ్‌ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు. ఆకర్షణీయమైన ప్యాకెట్‌లతో ముద్రణ చేసి ప్రజలను మోసం చెయ్యాలని ప్రయత్నిస్తున్న వీరు కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. ఇక హయత్‌నగర్ లోని ఓఆర్ఆర్ వద్ద గుట్టుగా తయారు చేస్తున్నకల్తీ పత్తి విత్తనాలను అగ్రికల్చర్ అధికారుల సమక్షంలో ఎస్ఓటీ టీం సీజ్ చేశారు.

22 లక్షలు విలువ చేసే 1.5 టన్నుల పత్తి విత్తనాలు స్వాధీనం .. కేసు నమోదు

22 లక్షలు విలువ చేసే 1.5 టన్నుల పత్తి విత్తనాలు స్వాధీనం .. కేసు నమోదు

ఇక ఈ కల్తీ విత్తనాలు తయారు చేసే గోదాంలో జియో-279, విరాట్, రాజ్‌కోట్, జియో-279, సర్పంచ్ గోల్డ్ బ్రాండ్ పేరుతో ముద్రించి అమ్మకాలు చేసి క్యాష్ చేసుకుంటున్నారు. ఇక వీరికి సీడ్ యాక్ట్ 1966 ప్రకారం లైసెన్స్ లేదని, ఎలాంటి లైసెన్స్ లేకుండా వీరు ఈ దందాకు పాల్పడుతున్నారని గుర్తించిన పోలీసులు వీరిపై సెక్షన్ 420 ఐపిసి, ఎస్ఇసి కింద అలాగే సీడ్ యాక్ట్ 1966 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇక ఈ ముఠా దగ్గర నుంచి 22 లక్షలు విలువ చేసే 1.5 టన్నుల పత్తి విత్తనాలు, ప్రాసెసింగ్, ప్యాకింగ్ ఎక్విప్మెంట్ ను సీజ్ చేశారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

English summary
Rachakonda SOT police stepped into the field and caught the gang of adultration in the name of various brands cotton seeds, on the needs of innocent farmers. They are trying to cheat the public by printing attractive packets and getting crores of rupees. The SOT team sieged cotton seeds in the presence of Agriculture Officers at the ORR in Hayatnagar .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X